కావాలయ్యా సాంగ్‌.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు | Mansoor Ali Khan Comments On Tamannaah Bhatia Kaavaalaa Song Dance | Sakshi
Sakshi News home page

Mansoor Ali Khan: కావాలయ్యా సాంగ్‌.. తమన్నా స్టెప్పు అస్సలు బాగోలేదు, ఎలా అనుమతిచ్చారోనన్న లియో నటుడు

Published Mon, Oct 23 2023 3:39 PM | Last Updated on Mon, Oct 23 2023 4:03 PM

Mansoor Ali Khan Comments On Tamannaah Bhatia Kaavaalaa Song Dance - Sakshi

జైలర్‌.. సినిమాయే కాదు ఇందులోని పాటలు కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్టయ్యాయి. అందులో తమన్నా ఆడిపాడిన నువ్వు కావాలయ్యా సాంగ్‌కు జనాలు థియేటర్లలో, సోషల్‌ మీడియాలో అలిసిపోయేదాకా స్టెప్పులేశారు. ఈ పాట తమిళ వర్షన్‌కు 75 మిలియన్స్‌ (ఏడున్నర కోట్లు), తెలుగు వీడియో సాంగ్‌కు 20 మిలియన్స్‌ (రెండు కోట్లు) వ్యూస్‌ వచ్చాయి. ఒక్క వీడియో సాంగ్‌కు కోట్లల్లో వ్యూస్‌ వచ్చాయంటే అది ఏ రేంజ్‌లో హిట్టయిందో తెలుస్తోంది.

దరిద్రంగా హుక్‌ స్టెప్‌..
అయితే ఈ పాటపై లియో నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్‌, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. తను నటించిన సరకు సినిమాలో సెన్సార్‌వాళ్లు చాలా సన్నివేశాలను కత్తిరించేశారట. శనివారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్‌ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

మరీ అంత అవసరం లేదులే
సెన్సార్‌ సభ్యుల తీరే అర్థం కావట్లేదు' అని మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'తన సినిమాలో కొన్ని సీన్లు సెన్సార్‌ బోర్డు ఎత్తేసినందుకు బాధపడటంలో తప్పు లేదు కానీ, అవతలి వారి సినిమాల్లో తప్పులను ఎత్తి చూపడం దేనికి' అని ప్రశ్నిస్తున్నారు. 'సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకోవాలేగానీ.. ఇలా ప్రతిదాన్ని భూతద్దంలో చూడనవసరం లేదు. ఈయన అలా మాట్లాడటం సరికాదు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు బిగ్‌ షాక్‌.. షో మధ్యలోనే అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement