నటుడు మన్సూర్ అలీఖాన్
చెన్నై : నటుడు మన్సూర్ ఆలీఖాన్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్ (17). బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్థనలు ముగించుకుని అడయారు వెళ్లారు. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో సర్ధార్ పటేల్ రోడ్డు మీదుగా బైక్‌లో స్నేహితునితో కలిసి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం తుగ్లక్ బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైకుపై వస్తున్న ఇద్దరు గాయపడ్డాడు. అడయారు ట్రాఫిక్ పోలీసులు తుగ్లక్‌తోపాటు అతడి స్నేహితుడిని సమీపంలోగల ఆస్పత్రిలో తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.