తమిళసినిమా: సంచలన నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తాజాగా ఈయన తన కొడుకు అలీఖాన్ తుగ్లక్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ కడమాన్‌పారై అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈయన కీలక పాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం తిరుచిట్రంఫలం ఇంకా థియేటర్లలో ప్రదర్శింపబడటం, గురువారం విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం విడుదల కావడం, శుక్రవారం అరుళ్‌నిధి నటించిన డైరీ చిత్రం తెరపైకి రానుండంతో తన చిత్రానికి ఎక్కువగా థియేటర్లు దొరకలేదని మన్సూర్ అలీఖాన్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అందులో చిత్ర ప్రచారానికి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు, అయినా అనుకున్నట్లు చిత్రం విడుదల కాకపోవడంతో విరక్తికి గురైనట్లు తెలిపారు. దీంతో తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment