నటి త్రిష వ్యవహారంలో నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారు. ఈయన ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన చర్యలను త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా నటి కుష్భు మన్సూర్ అలీఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రపంచ మహిళా కమిషన్ మద్దతుగా నిలిచింది. మన్సూర్ అలీఖాన్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తమిళనాడు డీజీపీ శంకర్ జివ్వాల్‌కు ఫిర్యాదుచేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై 354(ఏ), 509 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా గురువారం ఉదయం 10 గంటలకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా మన్సూర్ అలీఖాన్‌కు పోలీసు అధికారులు సమన్లు జారీ చేశారు. ఏ దురుద్దేశంలో తాను త్రిషపై వ్యాఖలు చేయలేదని కమిషనర్‌కు విన్నవించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు తన ముందస్తు బెయిల్ కోసం చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా త్రిష వ్యవహారంలో నటి కుష్భు మన్సూర్ అలీఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన త్రిషపై వాడిన భాష చేరి (స్లమ్) ప్రాంత ప్రజలువాడే వాషలో ఉందని విమర్శించారు. చేరి అనే భాషను రావడంపై సినీ దర్శకుడు పా.రంజిత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నటి ఖుష్భు మాట మార్చారు. తాను ఫ్రెంచ్ భాషలోని చేరి అనే పదాన్ని వాడానని తన ఎక్స్ మీడియాలో వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment