త్రిషకు అండగా నిలిచిన చిరంజీవి! | Megastar Chiranjeevi Reacts On Trisha, Mansoor Ali Khan Issue | Sakshi
Sakshi News home page

మన్సూర్‌ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి.. త్రిషకే నా మద్దతు: చిరంజీవి

Published Tue, Nov 21 2023 11:00 AM | Last Updated on Tue, Nov 21 2023 12:45 PM

Megastar Chiranjeevi Reacts On Trisha, Mansoor Ali Khan Issue - Sakshi

హీరోయిన్‌ త్రిషపై కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన్సూర్‌ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తూ త్రిషకు మద్దతు ప్రకటిస్తున్నారు. మన్సూర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక సీనియర్‌ హీరోయిన్‌ కుష్భూ అయితే ఏకంగా మహిళా కమీషన్‌ నుంచి కేసు కూడా నమోదు చేయించింది. టాలీవుడ్‌ నుంచే ఇప్పటికే హీరో నితిన్‌ ఈ వివాదంపై స్పందిస్తూ.. త్రిషకు మద్దతుగా నిలిచాడు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా త్రిష-మన్సూర్‌ వివాదంపై  ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు. 

(చదవండి: త్రిషతో వివాదం.. మన్సూర్‌ అలీఖాన్‌పై రెడ్‌ కార్డ్‌.. రియాక్ట్‌ అయిన నితిన్‌)

‘త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు  ఏ మహిళపై చేసినా  అసహ్యంగా ఉంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయిపై చేసినా నేను ఖండిస్తూ.. మహిళను అండగా, సపోర్ట్ గా నిలబడతాను అని’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి, త్రిష స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

అసలు మన్సూర్‌ చేసిన వ్యాఖ్యలేంటి?
లోకేశ్‌ కనగరాజ్‌-విజయ్‌ కాంబోలో వచ్చిన ‘లియో’చిత్రంలో మన్సూర్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించాడు. అందులో త్రిష హీరోయిన్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మన్సూర్‌ మాట్లాడుతూ..‘గతంలో నేను ఎన్నో రేప్‌ సీన్లలో నటించాను. ‘లియో’ ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతో కూడా రేప్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే.. నాకు అలాంటి సన్నివేశం లేదు. అందుకు బాధగా ఉంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడంతో.. మన్సూర్‌ వివరణ కూడా ఇచ్చాడు. తనకు త్రిషపై చాలా గౌరవం ఉందని.. సరదాగా మాట్లాడిన మాటలు..కొంతమంది కావాలనే వివాదస్పదం చేశారని ఆరోపించారు. 

(ఇది చదవండి: త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement