
కడమాన్‌పారై చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో మన్సూర్‌అలీఖాన్ ఒకరు. ఆయనకు విలన్‌గా గుర్తింపు తెచ్చిన చిత్రం విజయ్‌కాంత్‌తో నటించిన కెప్టెన్ ప్రభాకరన్. ఆ తరువాత అన్ని భాషల్లోనూ నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా వివిధ పాత్రల్లో 250 పైగా చిత్రాలలో నటించిన నటుడు మన్సూర్ అలీఖాన్. నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించి ఆ తరువాత దర్శకుడిగా, కథకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఆయన నటుడిగా పరిచయం అయిన తొలి తమిళ చిత్రం వేలైకిడైచ్చురుచ్చు.
తాజాగా తన రాజ్‌కెణడీ ఫిలింస్ పతాకంపై కడమాన్‌పారై అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన తమిళం, తెలుగు,మలయాళం, హింది భాషల్లో ఏక కాలంలో రూపొందించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన కొడుకు అలీఖాన్ తుగ్లక్ కథానాయకుడిగా పరిచయ అవ్వడం మరో విశేషం. ఇందులో అలీఖాన్ సిం హం,పులి,గాడిద,చిరుతలా జీవించే మనిషిలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కథానాయకులుగా అనురాగవి జెనీ ఫెర్నాండస్ నటిస్తున్నారు.
శివశంకర్, ఛార్మీ, దేవీతేజూ, బ్లాక్‌పాండి, అముదవానన్, మల్లై, కోదండం, పళనీ, కనల్‌కన్నన్, బోండామణి, పైయిల్మాన్ రంగనాధన్, లొల్లుసభ మనోహర్, వెంగళరావ్, ఆదిశివన్, విశింద్రన్, కూల్‌సురేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను మన్సూర్‌అలీఖాన్ తెలుపుతూ ఈ తరం కళాశాల విద్యార్థుల జీవన విధానాలను ఆవి ష్కరించే చిత్రమిదన్నారు. వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. దీనికి మహేశ్ ఛాయాగ్రహణ,రవివర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment