
సొంతంగా హెయిర్ కటింగ్ చేసుకోవాలనుకోవడం తేలికేగానీ, ్ర΄ాక్టికల్ విషయానికి వస్తేగానీ కష్టమేమిటో తెలియదు. బోలెడు ఓపిక ఉండాలి. దానికి నైపుణ్యం తోడు కావాలి.
‘ఇదంతా ఎందుకండీ... నా రోబోను చూడండి’ అంటున్నాడు షేన్ వైటన్.
అమెరికన్ ఇంజినీర్ షేన్ వైటన్ హెయిర్ కట్ చేసే రోబోను తయారు చేశాడు. రోబో ఒక కుర్రాడికి హెయిర్ కట్ చేసే వీడియోను ‘గెట్టింగ్ ఏ రోబో టు కట్ యువర్ హెయిర్’ కాప్షన్‌తో తన యూ ట్యూబ్ చానల్‌లో ΄ోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది.
‘వీడియోను జాగ్రత్తగా గమనిస్తే అతడి కళ్లలో అంతులేని భయం కనిపిస్తుంది. అంతవసరమంటారా?’ అంటూ ఒక యూజర్ స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment