ఫొటోలోని రోబోను చూశారు కదా! ఇది అచ్చం బౌన్సర్‌లాగానే యజమానికి రక్షణగా పనిచేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఏడీటీ కమర్షియల్’ ఇటీవల ‘హలోడీ రోబోటిక్స్’ నిపుణుల సహకారంతో దీనికి రూపకల్పన చేసింది. ఈ ఏడాది జరిగిన సీఈఎస్–2023 ప్రదర్శనలో ఈ రోబో బౌన్సర్‌కు చాలా ప్రశంసలు దక్కాయి.
‘ఇవోగార్డ్’ పేరిట తయారు చేసిన ఈ రోబో అధునాతనమైన హ్యూమనాయిడ్ రోబో. దీని కాళ్లకు చక్రాలు ఉండటం విశేషం. ఇది శరవేగంగా యజమాని కోరుకున్న చోటుకు చేరుకోగలదు.
కార్పొరేట్ సెక్యూరిటీ అవసరాలకు, కార్మికుల కొరత ఉండే చోట బరువులను ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడం వంటి పనులకు ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని తయారీదారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment