జామి: విజయనగరం జిల్లా జామి మండలంలో 9వ తరతగతి చదువుతున్న విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు వేధింపులకు గురిచేసి, జుత్తుకత్తిరించారు. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎంకే వలస గ్రామానికి చెందిన విద్యార్థిని కుమరాంలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
రోజూ బాలిక సైకిల్‌పై పాఠశాలకు వెళ్లివస్తుంది. రెండు రోజుల క్రితం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో బలరాంపురం, ఎంకే వలస గ్రామాలకు మధ్యలో ఉన్న మామిడితోటలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి వచ్చి బాలిక కళ్లకు గంతలు కట్టి గాయపరిచారు.
దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని విషయాన్ని ఇంటి వద్ద చెప్పి, తర్వాత రోజు పాఠశాలకు వెళ్లలేదు. తిరిగి శుక్రవారం పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో మళ్లీ ఆ గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి జుత్తును కత్తిరించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు శనివారం జామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఈఘటనకు పాల్పడినట్లు విద్యార్థిని చెప్పింది.
విద్యార్థినికి జుత్తు కత్తిరించిన ఆగంతకులు
Published Sun, Aug 23 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM
Advertisement
Advertisement