
ప్రతీకాత్మక చిత్రం
తిరువళ్లూరు(చెన్నై): విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు గాను.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలోనే విద్యార్థులకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేయించారు. తిరువళ్లూరు జిల్లా తిరువూర్‌లో ప్రభుత్వ మోడల్ పాఠశాల ఉంది. ఇక్కడ 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే పాఠశాలకు వచ్చే బాలురల్లో ఎక్కువ మంది స్టైయిల్ కటింగ్‌తో వస్తున్నట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. జుట్టు ఎక్కువగా పెంచుకోవడం, వన్‌సైడ్ కటింగ్, పంక్ కటింగ్ పేరుతో తరగతులకు హాజరవుతున్నారు.
దీంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ లేదనే భావన స్థానిక ప్రజల్లో ఏర్పడినట్లు తెలుస్తుంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు విద్యార్థుల ప్రవర్తన సైతం ఇబ్బందికరంగా మారింది. దీంల్ స్టైయిల్ కటింగ్ చేసుకున్న100 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠశాలలోనే సాధారణ కటింగ్ చేయించారు. టీచర్లను పలువురు స్థానికులు అభినందించారు. ఇది ఇలా ఉండగా విద్యార్థులకు స్టైయిల్ హెయిర్ కటింగ్‌లు చేయవద్దని కోరుతూ సెలూన్ నిర్వాహకులకు సైతం ఉపాధ్యాయులు కరపత్రాలను పంపిణీ చేయడం గమనార్హం.
చదవండి: సున్నం కొడుతుంటే రహస్య గది కనిపించింది.. అందులోకి వెళ్లి చూడగా..
Comments
Please login to add a commentAdd a comment