సాక్షి, హైదరాబాద్: లాండ్రీలు, ధోబీఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు.
అయితే బకాయిల పేరిట విద్యుత్ కనెక్షన్ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్‌లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment