‘బాజీరావు మస్తానీ’ కోసం రణవీర్ కేశత్యాగం! | Ranveer singh to make short hair sacrifice for Bajirao mastani film | Sakshi
Sakshi News home page

‘బాజీరావు మస్తానీ’ కోసం రణవీర్ కేశత్యాగం!

Published Sat, Aug 16 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

‘బాజీరావు మస్తానీ’ కోసం రణవీర్ కేశత్యాగం!

‘బాజీరావు మస్తానీ’ కోసం రణవీర్ కేశత్యాగం!

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాజీరావు మస్తానీ’ చిత్రంలో పాత్ర కోసం రణవీర్‌సింగ్ కేశత్యాగం చేయనున్నాడు. పూర్తిగా ఏడాది సమయం ఈ చిత్రం కోసమే కేటాయించనున్నట్లు రణవీర్ చెబుతున్నాడు. ఏడాది వ్యవధిలో నిజానికి మూడు సినిమాలు చేయవచ్చని, అయితే, ఈ సినిమా కోసం తాను రిస్క్ చేయదలచు కున్నానని అంటున్నాడు.
 
 అక్టోబర్ నుంచి ‘మొహెంజదారో’ షూటింగ్
 హృతిక్ రోషన్ హీరోగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కించనున్న ‘మొహెంజదారో’ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ‘జోధా అక్బర్’ తర్వాత హృతిక్, అశుతోష్‌ల కాంబినేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం. ‘మొహెంజదారో’ షూటింగ్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లేందుకు ఈ చిత్ర బృందం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement