పాత్ర కోసం గుండు కొట్టించిన బాలీవుడ్ నటుడు!
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'డ్రీమ్ ప్రాజెక్ట్' 'బాజీరావ్ మస్తానీ' చిత్రం కోసం బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ గుండు కొట్టించుకున్నాడు. పాత్ర కోసం రణవీర్ గుండు చేయించుకోవడానికి ఓకే చెప్పడంపై బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. బాజీరావు పాత్ర డిమాండ్ చేయడంతో ఇటీవల రణవీర్ గుండు కొట్టించుకుని వెరైటీ గెటప్ లో దర్శనమిచ్చారు.
సరైన నటీనటులు దొరకపోవడంతో గత పది సంవత్సరాలుగా ఈ చిత్రం వాయిదాలు పడుతూ వచ్చింది. బాజీరావు మస్తానీ చిత్రంలో నటించడానికి రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనేలు అంగీకరించడంతో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది.