భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ | Sanjay Leela Bhansali To Direct A Movie With Jr NTR | Sakshi
Sakshi News home page

భన్సాలీ చిత్రం.. విలన్‌గా ఎన్టీఆర్‌?

Published Sun, May 3 2020 9:13 PM | Last Updated on Sun, May 3 2020 9:13 PM

Sanjay Leela Bhansali To Direct A Movie With Jr NTR - Sakshi

పీరియాడికల్‌, భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించడంలో బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ సిద్దహస్తుడు. మరోవైపు పౌరాణిక పాత్రలు వేయడం టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు మంచి నీళ్ల ప్రాయం. వీరిద్దరూ కలిస్తే కల్ట్‌ క్లాసిక్‌ చిత్రం అవడం ఖాయం. ప్రసుత్తం సిని వర్గాల సమాచారం ప్రకారం భన్సాలీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ చిత్రం చేయబోతున్నట్లు టాక్‌. యంగ్‌టైగర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం భారీ మల్టీస్టారర్‌ కావడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు రణవీర్‌ సింగ్‌ కూడా నటిస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నెగటీవ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు మరో టాక్‌. పద్మావత్‌ చిత్రంలో ఖిల్జీ అనే నెగటీవ్‌ పాత్రలో పోషించిన రణవీర్‌కు హీరో షాహిద్‌కపూర్‌ కంటే ఎక్కువ పేరు వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా హీరోతో ఎన్టీఆర్‌కు హీరోతో సమాంతరమైన పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌తో భన్సాలీ తన స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారట. 

సంజయ్‌ ప్రస్తుతం అలియా భట్‌ ప్రధాన పాత్రలో ‘గంగూభాయి’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్‌ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని టాక్‌. అదేవిధంగా రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఎన్టీఆర్‌ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత భన్సాలీ-ఎన్టీఆర్‌ చిత్రం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. 

చదవండి:
బన్ని భారీ ఫైట్‌.. ఖర్చెంతో తెలుసా?
పెళ్లిపై కామెంట్స్‌.. నచ్చావ్‌ సుబ్బరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement