అతిగాడికి చెక్! | check for ranveer! | Sakshi
Sakshi News home page

అతిగాడికి చెక్!

Published Sun, Mar 1 2015 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

అతిగాడికి చెక్!

అతిగాడికి చెక్!

ఫిల్మీ దునియాలో రకరకాల క్యారెక్టర్లు చూశాం గానీ... రణవీర్‌సింగ్ లాంటి అతిగాడు తారసపడలేదనేది బాలీవుడ్ జనం టాక్. పార్టీల్లో చొక్కాలు విప్పేసి రెచ్చిపోవడం... నోటికొచ్చింది మాట్లాడేసి తరువాత సారీలు చెప్పుకోవడం వంటి అల్లరి పనుల్లో మనోడే నెంబర్ వన్ అనేది వారి అభిప్రాయం.
 
 ఈ మధ్య వివాదాస్పదమైన ‘ఏఐబీ నాకౌట్ రోస్ట్’ ఎపిసోడ్‌లో ఈ చిన్నోడి ఇన్వాల్వ్‌మెంట్‌పై ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ గరంగరంగా ఉన్నాడట. ప్రస్తుతం ఈయన తీస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలో రణవీర్ నటిస్తున్నాడు. ‘అసలందులో నువ్వెందుకు వేలు పెట్టావ్...’ అంటూ మొదలైన తిట్ల పురాణం ఈ కుర్ర హీరో చెవుల్లో నుంచి రక్తం వచ్చే వరకూ సాగిందట! చివరగా... ‘ఎక్కడెలా ఉండాలో సల్మాన్‌ఖాన్, షారూఖ్‌ఖాన్‌లను చూసి నేర్చుకో. చిల్లరగా ప్రవర్తించవద్దు’ అని ముగించాడట! పాపం... రణవీర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement