
పెదపాడు: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందడంతో పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం.. పెదపాడు మండలం వడ్డిగూడెంకు చెందిన ఘంటసాల ఉదయ్‌కుమార్‌రాజుతో కృష్ణా జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి చెందిన చంటి(25)కి 2013లో వివాహమైంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె మృతి చెంది ఉండటంతో ఉదయ్ చంటి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఆమె తండ్రి మోరు రామకృష్ణ ఫిర్యాదుతో పెదపాడు ఏస్సై అర్జునరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్, చంటి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంటి మృతదేహాన్ని తహసీల్దార్ జీజేఎస్ కుమార్ శనివారం పరిశీలించారు. ఆమె మృతికి గల కారణాలను గ్రామంలో ఆరాతీశారు.
Comments
Please login to add a commentAdd a comment