![బజాజ్ అలయంజ్ జీఐ లాభం రూ.562 కోట్లు](/styles/webp/s3/article_images/2017/09/3/61432239079_625x300.jpg.webp?itok=sx6NDXTO)
బజాజ్ అలయంజ్ జీఐ లాభం రూ.562 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీ బజాజ్ అలయంజ్ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సర నికర లాభంలో 37 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడిచిన ఏడాది రూ. 962 కోట్ల విలువైన క్లెయిమ్‌లు చెల్లించినప్పటికీ రూ. 562 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. జమ్మూ కశ్మీర్ వరదలు, హుద్ హుద్ తుపాన్ వంటి భారీ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని మరీ ఈ లాభాలను నమోదు చేసినట్లు కంపెనీ ఎండీ సీఈవో తపన్ సింఘల్ తెలిపారు.
ఈ ఏడాది కాలంలో పరిశ్రమ 10 శాతం వృద్ధిని నమోదు చేస్తే బజాజ్ అలయంజ్ 16 శాతం వృద్ధితో రూ. 5,305 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు.