
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్... సోమవారం కొత్తపాలసీని ప్రవేశపెట్టింది. బజాజ్ అలయంజ్ లైఫ్ హెల్త్ కేర్ గోల్ పేరుతో రూపొందిన ఈ పాలసీ 36 రకాల క్లిష్ట ఆరోగ్య సమస్యలను కవర్ చేస్తుంది. ఒక ప్రీమియంతో ఒకే పాలసీ కింద ఆరుగురు సభ్యులున్న కుటుంబం లబ్ధి పొందవచ్చు. రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవరేజ్ ఉంటుంది. సంప్రదాయ హెల్త్ పాలసీలతో పోలిస్తే ఇది చాలా భిన్నం. సమస్యను గుర్తిస్తూ డయాగ్నస్టిక్ సెంటర్ ఇచ్చే రిపోర్ట్ ఉంటే చాలు. బీమా మొత్తాన్ని పాలసీదారు ఖాతాలో జమ చేయడం ఈ పాలసీ ప్రత్యేకత.
క్లెయిమ్ చేయనట్టయితే..
పిల్లల క్లిష్ట ఆరోగ్య సమస్యలను సైతం కవర్ చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమదేనని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 36 రకాల్లో పాలసీదారుకు ఇప్పటికే ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్టయితే 90 రోజుల తర్వాత కవరేజ్ లభిస్తుందని చెప్పారు. 32–35 ఏళ్ల వయసున్న పాలసీదారు, ఆయన భార్య, ఇద్దరు పిల్లల కోసం రూ.6,477 చెల్లిస్తే రూ.5 లక్షల పాలసీ లభిస్తుంది. 10, 15, 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో క్లెయిమ్ చేయనట్టయితే చెల్లించిన ప్రీమియం వెనక్కి వస్తుంది. ఈ ఫీచర్ కావాల్సినవారు సుమారు రెండింతల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment