'ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం'
Published Sat, Sep 10 2016 7:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
హైదరాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించే విషయమై సీఎంతో మాట్లాడుతానని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 31 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రజకులను గ్రామ బహిష్కరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Advertisement
Advertisement