
ఉద్యమనేతలకే ప్రాధాన్యం
► విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
► తిరుమలగిరి ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరు
తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారికే పదవుల పందేరంలో తొలి ప్రాధాన్యముంటుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తిరుమలగిరిలో బుధవారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లా డారు. కొత్తగా చేరిన వారికి అవకాశాన్ని బట్టి గుర్తింపు ఇస్తామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నా యన్నారు. -తిరుమలగిరి
తిరుమలగిరి :- పదవుల పందేరంలో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరిలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలకవర్గం పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తగా చేరిన వారికి అవకాశాన్ని బట్టి గుర్తింపు ఇస్తామన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు ఈ రెండు సంవత్సరాలలోనే ఎంతో అభివృద్ధి చెందాయన్నారను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే సంవత్సర కాలంలోనే ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు నీళ్లు అందిస్తామని పే ర్కొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్ర తిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయన్నా రు. సూర్యాపేట నియోజకవర్గంలో ఈ రెండేళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదని, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటు న్న మాజీమంత్రి ఆర్.దామోదర్ రెడ్డి పల్లెలకు వెళితే అభివృద్ధి ఏ జరిగిందో తెలుస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ని ధులను కూడా ఖర్చు చేయని ఘనత దా మోదర్ రెడ్డికే దక్కిందని విమర్శించారు. 30ఏళ్లుగా ప్రజా ప్రతినిధినిగా ఉండి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకే సమాధానం చె ప్పాలన్నారు.
మాజీ ఎమ్మె ల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు కాంట్రాక్టులు చేసి రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. మార్కె ట్ కమిటీ పా లకవర్గం రైతుల పక్షాన నిల చి నిలిచి పనిచేయూలని కోరా రు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తుం గతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, మార్కె ట్ కమిటీ చైర్‌పర్సన్ పాశం విజయయాదవరెడ్డి, వైస్ చైర్మన్ యుగేంధర్‌రావు, ఎంపీ పీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పి.పూల మ్మ, వైస్ ఎంపీీ ప ఎస్.జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ జి.అశోక్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డీడీఎం శ్రీనివాస్, ఏడీఎం అలీమ్, కార్యదర్శి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.