సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా పలువురు నేతలపై రైల్వే శాఖ నమోదు చేసిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, స్వామిగౌడ్‌లతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో పాటు మరో 130 మందిపై నమోదు చేసిన కేసులను రద్దు చేసింది. గత నవంబర్‌లో జారీ చేసిన ఈ ఉత్తర్వులను ఆ తర్వాత తాత్కాలికంగా నిలిపివేస్తూ (అబయన్స్) జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నేతలపై ప్రభుత్వం కేసులు ఉపసంహరించడంపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో ప్రభుత్వం కేసుల ఉపసంహరణ జీవోను అబ యన్స్‌లో పెడుతూ మరో జోవో ఇచ్చింది. తాజా గా శనివారం మరో జీవో ఇచ్చింది
Comments
Please login to add a commentAdd a comment