తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన రైల్వే కేసులను వెం టనే ఎత్తివేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు సీపీఐ వినతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన రైల్వే కేసులను వెం టనే ఎత్తివేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బం డారు దత్తాత్రేయకు సీపీఐ విజ్ఞప్తి చేసింది. రైల్ రోకో సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రాకపోకలను నిలిపేసినా, రైల్వే శాఖ ఆదేశాల మేరకు అనేక మంది రాజకీయ నాయకులు, క్రియాశీల కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. ఆదివారం ఈ మేరకు దత్తాత్రేయను ఆయన నివాసంలో కలుసుకుని సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, సుధాకర్ తదితరులు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు కావొస్తున్నా కేసులు ఎత్తివేయకపోవడం అన్యాయమని చాడ పేర్కొన్నారు. వందలాది మంది ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని తెలిపారు. తనపై కూడా హైదరాబాద్, కాజీపేట రైల్వే కోర్టులలో కేసులు నడుస్తున్నాయని, జరిమానా కట్టమని న్యాయవాదులు చెప్పినా తాను ఒప్పుకోలేదని తెలిపారు.