ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ: కేసీఆర్
హైదరాబాద్: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా.. తెలంగాణకు ఆయన చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, స్వాతంత్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఏకైక వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని కేసీఆర్ అన్నారు. భావి తరాలు లక్ష్మణ్ బాపూజీ సేవల్ని గుర్తు పెట్టుకుంటాయని కేసీఆర్ తెలిపారు.