
తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత!
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిపై సమైక్య రాష్ట్రంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిపై సమైక్య రాష్ట్రంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పది జిల్లాల్లో 500కు పైగా కేసులు అప్పట్లో నమోదయ్యాయి. వీటిని జిల్లాల వారీగా మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఒక ఫైలు సిద్ధం చేశారు.
న్యాయశాఖకు పంపాల్సిన ఈ ఫైలు మీద ఇప్పటికే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతకం చేశారు. దీంతో ఒకటి లేదా రెండు రోజుల్లోనే తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది.