ఉద్యమంలో గ్రూప్–1 అధికారుల పాత్ర ప్రశంసనీయం
► ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో గ్రూప్–1 అధికారుల పాత్ర ప్రశంసనీయమని ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో తెలంగాణ గ్రూప్–1 అసోసియేషన్ డైరీని నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడు తూ, ఉద్యమంలో గ్రూప్–1 అధికారులు తమ హోదాలను పక్కన పెట్టి 2010లో నిర్మాణాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. అసోసియేషన్ అధ్యక్షుడు మామిడ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ, సహాయ నిరాకర ణ, సకలజనుల సమ్మె ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ఏర్పాటుకు తమ వంతు పాత్ర పోషిం చామని అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతీ సోమవారం గ్రూప్–1 అధికారులందరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.