హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పరస్పర ఆరోపణల మొదలు.. అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలు వాడే భాష దాకా.. విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం నాటి పరిణామాలు మరింత నాటకీయంగా సాగాయి.
పదేళ్లపాటు అధికారపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్.. తొలిసారి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇది ఇక్కడితోనే అయిపోలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు యత్నించగా.. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది. జై తెలంగాణ అంటూ పోస్ట్ చేశారాయన. అసెంబ్లీలో నిన్నటి నిరసన.. తెలంగాణఉద్యమ కాలం నాటి రోజుల్ని గుర్తు చేసిందంటూ సందేశం ఉంచారు.
Yesterday’s protest in Assembly brought back memories of Telangana Agitation Days
— KTR (@KTRBRS) February 15, 2024
మాకు కొట్లాట కొత్తేమీ కాదు!
గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి… రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది.
జై… pic.twitter.com/Zn1IidXhQS
Comments
Please login to add a commentAdd a comment