
జై తెలంగాణ
మెదక్ మున్సిపాలిటీ : నా పేరు జై తెలంగాణ అని పెట్టడం గర్వంగా ఉంది. మా అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. నాన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ప్రతి రూపంగా నా పేరు పెట్టాడు. నాన్న తెలంగాణ ఉద్యమంలో పని చేసిన తీరు నాకు పదేపదే చెబుతుంటాడు. నేను చిన్నప్పుడు ఉద్యమంలో నాన్న వెంట పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఊహ తెలిసినప్పుటి నుంచి కేసీఆర్ సార్‌ను కలవాలన్నది నా కోరిక. మే నెలలో కేసీఆర్ సార్∙ మెదక్ వచ్చినప్పుడు ఆయనను కలవాలని బహిరంగ సమావేశానికి నాన్నతో కలిసి వెళ్లాను. కానీ ఆయనను కలిసే అవకాశం నాకు దక్కలేదు. ఎప్పుటికైనా కేసీఆర్ సార్‌ను కలవాలన్నదే నా కోరిక.