
ప్రజల సొమ్ముతో కేసీఆర్ రాజసౌధం!
సాక్షి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దుబారా, సోకులకు పోరుు ప్రజల సొమ్ముతో తొమ్మిదెకరాల్లో 150 గదులతో రాజసౌధం నిర్మించుకోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. ఇంత పెద్ద భవనం దేశ ప్రధానికి సైతం లేదన్నారు. సామాన్యులకు డబుల్ బెడ్‌రూమ్‌లు లేకపోరుునా..సీఎం మాత్రం ఇంద్రభవనం నిర్మించుకోవడం ఏంటని ప్రశ్నించారు. జనహితం కోరుకోకుండా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించిన సామాజిక శక్తులను అరెస్ట్ చేరుుంచడం విచారకరమన్నారు. కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు.
హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుంటే నిర్బంధాలతో అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల అనుమతి తీసుకుని ధర్నాచౌక్‌లో నిరసన తెలపడానికి వెళ్తే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. రెండున్నరేళ్లలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. దళితులకు భూపంపిణీ, రుణమాఫీ, ఫీజురీరుుంబర్స్‌మెంట్ విడుదలపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను వదిలి తన సీటులో చినజీయర్‌స్వామిని కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. మంద కృష్ణకు రెండు నెలలుగా అపారుుంట్‌మెంట్ ఇవ్వకపోవడం జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు.
బంగారు తెలంగాణ అంటే ఇదేనా - మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రంలో డెంగీ, విషజ్వరాలతో జనం ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసమస్యలను విస్మరించడమేనా బంగారు తెలంగాణ అని మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14వేల టీచర్ల ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలను పెంచిపోషిస్తున్నారన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, మానాల లింగారెడ్డి, జిల్లా నాయకులు మేరి, మాల మహార్ రాష్ట్ర కన్వీనర్ వెంకటస్వామి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మేడి అంజయ్య, టీవీవీ జిల్లా నాయకులు వెంకటేశ్, వనిత, మాధవి, అనిల్, మల్లేశం, శ్రీనివాస్, దుర్గయ్య, దళిత లిబరేషన్‌ఫ్రంట్ నాయకుడు మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు.