
రాములమ్మ(ఫైల్)
సాక్షి, మద్దూరు(మెదక్): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న చేర్యాల మండలంలోని కమలాయపల్లి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య సతీమణి రాములమ్మ(75) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.
మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటిలో మృతి చెందింది. రాములమ్మ మృతికి సర్పంచ్ ఓరుగంటి అంజయ్య, కొమురవెళ్లి ఆలయ మాజీ డైరెక్టర్ శంకరాచారి సంతాపం తెలిపారు.