doddi komaraiah
-
అధికారికంగా సదర్: కేటీఆర్
తుర్కయాంజాల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతితోపాటు సదర్ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మన్నెగూడలో నిర్వహించిన గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కులవృత్తులకు జీవం పోసి గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2014కు ముందు గొర్రెల పెంపకందారుల సొసైటీలో 2.21 లక్షలమంది సభ్యులు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 7.61 లక్షలకు పెరిగిందన్నారు. టాటాలు మాత్రమే కాకుండా, తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదా? నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు గొల్ల, కురుమలకు బ్యాంక్ రుణాలిచ్చేందుకు ఎన్సీడీపై సంతకాలే పెట్టలేదని కేటీఆర్ గుర్తు చేశారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పిల్లలను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ పనితీరును పక్క రాష్ట్రాలవారు అభినందిస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలకు అభివృద్ధి, సంక్షేమం కనబడటం లేదని విమర్శించారు. నవంబర్ 5 తర్వాత పెంపకందారులకు నచ్చినచోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గొల్ల, కురుమల అభివృద్ధి కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సాయుధ పోరాట వీరుడి సతీమణి కన్నుమూత
సాక్షి, మద్దూరు(మెదక్): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న చేర్యాల మండలంలోని కమలాయపల్లి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య సతీమణి రాములమ్మ(75) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటిలో మృతి చెందింది. రాములమ్మ మృతికి సర్పంచ్ ఓరుగంటి అంజయ్య, కొమురవెళ్లి ఆలయ మాజీ డైరెక్టర్ శంకరాచారి సంతాపం తెలిపారు. -
ప్రత్యక్ష పోరాటాలే ఆయనకు నిజమైన నివాళి
సాక్షి,హైదరాబాద్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రత్యక్ష ఆందోళనలకు దిగడమే అమరుడు దొడ్డి కొమరయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. గతంలో వెట్టిచాకిరీ రూపంలో అణచివేత ఉంటే, ఇప్పుడు ప్రజాస్వామ్య ముసుగులో పరోక్షంగా అది కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 74వ వర్థంతి సందర్భంగా శనివారం మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొమరయ్య చిత్రపటానికి పార్టీనాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, వీఎస్ బోస్, డా. సుధాకర్, ఈటీ నర్సింహ పూలమాలలేసి నివాళులర్పించారు. అణచివేత సాధ్యం కాదు భూస్వాములు, పెట్టుబడిదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో తిరుగుబాటుతత్వాన్ని అణచివేయడం సాధ్యం కాదని తెలంగాణ సాయుధపోరాటం గుర్తుచేస్తోందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రైతుసంఘం కార్యాలయంలో కొమరయ్య చిత్రపటానికి మల్లారెడ్డి, టి.సాగర్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. టీఎన్జీవోల నివాళి దొడ్డి కొమరయ్యకు టీఎన్జీవో నేతలు నివాళులు అర్పించారు. టీఎన్జీవోల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కొమరయ్య అమరత్వం రాష్ట్ర ప్రజా పోరాటాల చరిత్రలో విశిష్టమైందన్నారు. -
సాయుధపోరాట స్ఫూర్తి దొడ్డి కొమురయ్య
తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి, భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వం ప్రధాన కారణం. ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్‌ఖాన్ కాలంలో తెలంగాణ ప్రజలు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నిజాం అండదండతో గ్రామాల్లో జాగీర్దారులు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు దేశ్‌పాండేలు, దొరలు పేట్రేగిపోయి ప్రజలను విపరీతంగా పీడించేవారు. అలాంటి వారిలో ఒకడు విస్నూర్ దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి. 60 గ్రామాలకు మకుటం లేని మహారాజు. అతని ఆగడాలకు హద్దు, పద్దూ లేదు. పరమ కిరాతకుడు. భువనగిరిలో 1944 ఆంధ్రమహాసభ (సంఘం) సమావేశం చైతన్యంతో కడివెండిలో గ్రామ సంఘం ఏర్పడింది. ఊరి జనమంతా ఒక్కో ‘అణా’ చెల్లించి సంఘంలో జేరి, గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ఎదురు తిరిగారు. సంఘం అండతో దొరసాని జానమ్మకు పన్ను కట్టడం మానేశారు. పన్ను చెల్లించని వారిపైనా ముఖ్యంగా జానమ్మకు ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య కుటుంబంపై ఒత్తిడి పెరగగా తన సోదరుడికి కొమురయ్య కూడా అండగా నిలబడ్డాడు. ఈ సందర్భంగా దొరసానికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా 1946 జూలై 4న దేశ్‌ముఖ్ రాంచంద్రారెడ్డి మామ గడ్డం నర్సింహా రెడ్డి నేతృత్వంలో ప్రజా నాయకుడిగా ఎదిగిన ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్లా నర్సింహను హత్య చేయాలని కుట్రపన్ని అందులో భాగంగా దేశ్‌ముఖ్ అనుచరుడు మస్కీనలీ నాయకత్వంలో 40 మంది గుండాలు కడవెండి గ్రామంలోకి వచ్చారు. చీకటి పడే సమయంలో గుండాలు బండ బూతులు తిడుతూ రెచ్చగొడుతూ కార్యకర్తల ఇండ్లపైకి రాళ్ళు రువ్వడం ప్రారంభిం చారు. సంఘం ఆర్గనైజర్ కె.రాంచంద్రారెడ్డితో పాటు రెండు వందలమందికి పైగా ప్రజలు ఆంధ్రమహాసభకు జై, సంఘం వర్ధిల్లాలి, దేశ్‌ముఖ్ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిస్తూ ర్యాలీగా బయల్దేరారు. దొడ్డి కొమురయ్య తన అన్న మల్లయ్యతో కల్సి ముందు వరుసలో నిలిచాడు. గడ్డం నర్సింహరెడ్డి, మస్కీనలీ అనుచర గుండాలు ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ర్యాలీ గఢీని సమీపించగానే జరిపిన తుపాకి కాల్పుల్లో ఓ తూటా దొడ్డి కొమురయ్య పొట్టలోకి దూసుకుపోగా, ‘ఆంధ్ర మహాసభకు జై’ అంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. కొమరయ్య మృత దేహాన్ని జనగాం తరలించి పోస్టుమార్టం నిర్వహించి నెల్లుట్ల గ్రామం వద్ద పూడ్చిపెట్టారు. కొమురయ్య హత్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు జరిగి తెలంగాణ కొలిమై మండడంతో సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైంది. దొడ్డి కొమురయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడు. (నేడు దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్భంగా)అస్నాల శ్రీనివాస్, హైదరాబాద్ -
డీకే అమరత్వానికి 73 ఏళ్లు
సాక్షి, దేవరుప్పుల: నాటి నైజాం ప్రభుత్వ రాచరికానికి వ్యతిరేకంగా భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు దోహదపడిన దొడ్డి కొమురయ్య(డీకే) తొలి అమరత్వానికి నేటికి 73 ఏళ్లు నిండుకున్నాయి. నిజాం సర్కారు హయాంలో విస్నూర్ కేంద్రంగా దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి అరవై గ్రామాలపై ఆదిపత్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తల్లి జానకమ్మ దొరసాని కడవెండి కేంద్రంగా దేవరుప్పుల మండలంలో దేశ్‌ముఖ్ గుండాలచే పాల్పడే ఆకృత్యాలు, వెట్టిచాకిరి, శిస్తు పేరిట 70 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు స్వాధీనం చేసుకొని ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడేది. ఈ క్రమంలోనే ఆంధ్ర మహాసభ సంఘ సందేశంతో నల్లా నర్సింహ్ములు, చకిల యాదగిరి, మందడి మోహన్‌రెడ్డి తదితరుల హయాంలో గుతపల(కర్ర)సంఘం ఏర్పర్చారు. 1947 జూలై 4వ తేదీన ప్రస్తుత బొడ్రాయి ఏరియాలో ఓ ఇంటిని స్థావరంగా మార్చుకున్న దొరసాని ఆగడాలను ఎండగడుతూ ప్రదర్శనకు వస్తుండగా గుండాలు విచక్షణ రహితంగా తుపాకీతో కాల్చగా తొలుత దొడ్డి మల్లయ్య తొడకు, మంగళి కొండయ్య నుదట, దొడ్డి నర్సయ్య మోచేతి గుండా వెళ్లిన తుటాలు ఆ తర్వాత దొడ్డి కొమురయ్య పొట్టలో నుంచి తుటాలు పోవడంతో రక్తంతో నేలతడిచింది. శాంతియుతంగా కొనసాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్త కొమురయ్య తొలి అమరత్వంతో రక్తానికి రక్తం... ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మల్చుకొని ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కింది. నిజాం సర్కారు నుంచి విముక్తి పొందిన తెలంగాణ ఆరున్నర దశాబ్దాలు పాటు సీమాంధ్రుల చేతిలో నలిగిన నేపథ్యంలో ఆ పోరాట స్ఫూర్తితోపాటు 1969 నాటి విద్యార్థుల రక్తార్పణంతో రగిలి నేటి తెలంగాణను సాధించుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు అధికారికంగా దొడ్డి కొమురయ్య సంస్మరణ జరుపకపోవడం గమనార్హం. వారసత్వపు సంస్మరణ సభ ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కిన దొడ్డి కొమురయ్య స్మారకార్థం సీపీఐ ఆధ్వర్యంలో కడవెండిలో బొడ్రాయి వద్ద భారీ స్థూపంతోపాటు సమీపంలోనే స్థానికులకు ఉపయోగపడేలా స్మారక భవనం నిర్మించారు. స్థానికంగా నేటికి పంచాయతీ భవనం నోచుకోక ఈ భవనంలోనే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించుకోవడం అద్దం పడుతుంది. కాగా ప్రతి ఏటా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున డీకే సంస్మరణ సభలు కొనసాగిస్తూ తమ ఎర్రజెండా వారసత్వాన్ని చాటుతున్నారు. పత్రికలో మరణవార్త నిజాం కాలంలో వెలుగొందుతున్న మీజాన్ పత్రికలో విస్నూర్ దొరల విజృంభణ, ఆంధ్ర మహాసభ కార్యకర్త ‘దొడ్డి కొమురయ్య హతం’ అనే వార్తా కథనం తొలి అమరత్వానికి చారిత్రాత్మకంగా నిలిచింది. పోరాటం లేకుంటే రాష్ట్రం వచ్చేదా? నిజాం సర్కారు విముక్తి కోసం సాగిన ఆ పోరాటం లేకుంటే ఈనాటి తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈ ప్రాంతంలో విస్నూర్ దేశముఖ్లను అంతమొందించేందుకు స్వార్థం లేకుండా తుపాకీ పట్టి పోరాటం చేశాం. అలాంటి అమరుల విగ్రహాలు ఏర్పరచి రాష్ట్రంలో ప్రభుత్వమే ఏటా కొలిచేలా సభలు పెట్టాలి. – జాటోతు దర్గ్యానాయక్, ధర్మాపురం -
దొడ్డి కొమురయ్య అమరత్వానికి 68 ఏళ్లు
కడవెండి(దేవరుప్పుల) : భూమి కోసం... భుక్తి కోసం చేపట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొముర య్య అమరత్వానికి 68 ఏళ్లు నిండాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం పాలనలో విస్నూర్ దేశ్‌ముఖ్‌ల లాంటి భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ కొనసాగుతుండేది. వారికి వ్యతిరేకంగా కడవెండిలో 1946 జూలై 4వ తేదీన గుప్తల సంఘం ప్రదర్శన ఇస్తుండగా జానమ్మ దొరసాని గుండాల తుపాకీ తూటాలకు దొడ్డి కొమురయ్య ఎదురొడ్డి నిలిచి ప్రాణత్యాగం చేయడంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది. ఈ క్రమంలోనే కొమురయ్య స్మారకార్థం సీపీఐ ఆధ్వర్యంలో కడవెండి పంచాయతీ కార్యాలయం ఎదుట భారీ స్మారక స్థూపం నిర్మించా రు. ఏటా కొమురయ్యకు జోహార్లు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం భారీ బహిరంగా సభ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విద్యార్థి, మేధావి వర్గాలతో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి అస్నాల శ్రీనివాస్ తెలిపారు. అమరుడు దొడ్డి కొమురయ్య సంస్మరణ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత తొలిసారిగా నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆ విప్లవ గాథను విస్మరించొద్దు
1946, జులై 4న జరిగిన దొడ్డి కొమరయ్య ప్రాణ త్యాగంతో కమ్యూనిస్టుల తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పినా, రావి నారాయణరెడ్డి (ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు), బద్దం ఎల్లారెడ్డి (తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి), మగ్దూం మొహియుద్దీన్ (అఖిల హైదరాబాద్ రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు) ఇచ్చిన పిలుపుతో 1947, సెప్టెంబర్ 11న సాయుధ పోరు ప్రారంభమైందని అంటారు. తరతరాలుగా ప్రజలను బానిసలుగా చూస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్న దొరలను, దొర గడీల వ్యవస్థను కూల్చిన సాయుధ పోరాటం తెలంగాణ నేలపై జరిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించి దేశమంతా ఉత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణలో ఆ ఛాయలు లేవు. తమ బతుకులను మార్చు కునేందుకు ‘దున్నేవానిదే భూమి’ నినాదం తో తెలంగాణలో పోరాటం జరిగింది. 1947 సెప్టెంబర్ 11వ తేదీన మొదలైన ఆ పోరాటం 1948 సెప్టెంబర్ 17 వరకు కొనసాగింది. ఖాసిం రజ్వీ సైన్యం తెలంగాణను గాయపరి చింది. కారం పొట్లాలు, రోకలి బండలు, బరి సెలు, వడిసెల రాళ్లతో మొదలైన పోరాటం అంతిమంగా సాయుధమైంది. బందగీ త్యాగంతో మొదలైన భూపోరాటం, ఐలమ్మ బువ్వగింజల పోరుగా, దొరగడీని కూల్చి వేసిన దొడ్డి కొమరయ్య మహాప్రస్థానంగా సాగింది. స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపు కోవలసిన తెలంగాణ ఎందుకు తుపాకి పట్టి నెత్తురు ముద్దగా మారిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఉక్కు మనిషిగా మారిపోయింది. సోషలిస్టు తరహా ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తానని హామీలు ఇచ్చి న నేతలు కూడా ఒక్క మాటైనా చెప్పకుండా సైనిక చర్యకు ఉపక్రమించారు. ఫలితంగా 4,000 మంది అమరులయ్యారు. ఆ అమ రుల నెత్తురు నుంచే దేశంలో భూసంస్కరణల అమలు చట్టాలు ప్రభవించాయి. ఇది తెలంగాణ చరిత్ర. తెలంగాణ సాయుధ పోరుకు అంకురార్పణ జరిగి ఈ సెప్టెంబర్ 11కు 66 సంవ త్సరాలైంది. జులై 4, 1946న జరిగిన దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతో కమ్యూనిస్టుల తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పినా, రావి నారాయణరెడ్డి (ఆంధ్ర మహాసభ అధ్య క్షుడు), బద్దం ఎల్లారెడ్డి (తెలంగాణ కమ్యూ నిస్టు పార్టీ కార్యదర్శి), మగ్దూం మొహి యుద్దీన్ (అఖిల హైదరాబాద్ రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు) ఇచ్చిన పిలుపుతో 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరు ప్రారంభ మైందంటారు. ఈ త్యాగాల చరిత్రను కొత్త తరం రక్తంలోకి ఎక్కిస్తే మళ్లీ దండ కార ణ్యాలు భగ్గున మండుతాయనో ఏమో కానీ గ్రీన్‌హంట్ సిలబస్‌లు చెబుతున్నారు. 14వ నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు ప్రజలను కదిలించాయి. ఈ మహాసభల పునాదుల మీదే రైతాంగ పోరాటం రూపు దిద్దుకుంది. ఈ సాయుధ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన కమ్యూనిస్టు నాయకులే ఆ తర్వాత అంతర్జాతీయంగా పేరు గడించారు. ఈ పోరాటం లేకపోతే దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చ లపల్లి సుందరయ్య, చండ్రపుల్లారెడ్డి, తరి మెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, భీమి రెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి లాంటి నేతలు ఉద్భవించేవారు కాదు. ఆ మహత్తర పోరాటాన్ని ప్రఖ్యాత చిత్రకా రుడు చిత్తప్రసాద్ తన చిత్రాలలో లిఖించారు. ఇప్పుడు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకునేందుకు సిద్ధమైంది. ఇంత మహో జ్వల చరిత్రపైన ఎవరి నీలినీడలు కమ్ముకు న్నాయోగానీ, ఈ తరానికి తెలియకుండా చేస్తున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డా ఈ నేల కున్న గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ఆనాటి సంస్కృతిని, సంప్రదాయాలను, ఆ పోరులో వాడిన ఆయుధాలను, ఆనాటి ప్రజల కట్టుబాట్లను ప్రతిబింబించే పురా వస్తు ప్రదర్శనశాలను నెలకొల్పాలి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి, నల్లా నర్సింహులు లాంటి వేల మంది త్యాగ ధనుల స్ఫూర్తి ఆ మ్యూజియంలో కనిపిం చాలి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు తెలం గాణలో సుమారు 15 వేల మందికి పైగా ఎర్రదారిలో నిలిచి అసువులు బాశారు. ఆ వీరుల స్మృతి చిహ్నంగా, ఈ నాటి మలిదశ పోరాటంలో అసువులు బాసిన వారి స్మృత్య ర్థం ఇండియాగేట్ మాదిరిగా తెలంగాణ గేట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలి. మాతృ భాషలో బోధన కోసం, మాతృ భాష కోసం ఆత్మగౌరవ పోరాటం తెలంగాణలోనే జరిగిం దన్న విషయాన్ని తెలియజేయాలి. ఆ చరి త్రను కొత్తతరం అధ్యయనం చేస్తే ఎందరెం దరో క్యాస్ట్రోలు, చేగువేరలు, భగత్‌సింగ్‌లు, సుభాష్ చంద్రబోస్‌లు అవతరిస్తారు. - జూలూరు గౌరీశంకర్ అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక (వీర తెలంగాణలో సాయుధ పోరాటం ప్రారంభమై నేటికి 66 సంవత్సరాలు)