కడవెండి(దేవరుప్పుల) : భూమి కోసం... భుక్తి కోసం చేపట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొముర య్య అమరత్వానికి 68 ఏళ్లు నిండాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం పాలనలో విస్నూర్ దేశ్‌ముఖ్‌ల లాంటి భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ కొనసాగుతుండేది. వారికి వ్యతిరేకంగా కడవెండిలో 1946 జూలై 4వ తేదీన గుప్తల సంఘం ప్రదర్శన ఇస్తుండగా జానమ్మ దొరసాని గుండాల తుపాకీ తూటాలకు దొడ్డి కొమురయ్య ఎదురొడ్డి నిలిచి ప్రాణత్యాగం చేయడంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది.
ఈ క్రమంలోనే కొమురయ్య స్మారకార్థం సీపీఐ ఆధ్వర్యంలో కడవెండి పంచాయతీ కార్యాలయం ఎదుట భారీ స్మారక స్థూపం నిర్మించా రు. ఏటా కొమురయ్యకు జోహార్లు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం భారీ బహిరంగా సభ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విద్యార్థి, మేధావి వర్గాలతో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి అస్నాల శ్రీనివాస్ తెలిపారు.
అమరుడు దొడ్డి కొమురయ్య సంస్మరణ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత తొలిసారిగా నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దొడ్డి కొమురయ్య అమరత్వానికి 68 ఏళ్లు
Published Fri, Jul 4 2014 4:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement