ఆ విప్లవ గాథను విస్మరించొద్దు
1946, జులై 4న జరిగిన దొడ్డి కొమరయ్య ప్రాణ త్యాగంతో కమ్యూనిస్టుల తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పినా, రావి నారాయణరెడ్డి (ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు), బద్దం ఎల్లారెడ్డి (తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి), మగ్దూం మొహియుద్దీన్ (అఖిల హైదరాబాద్ రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు) ఇచ్చిన పిలుపుతో 1947, సెప్టెంబర్ 11న సాయుధ పోరు ప్రారంభమైందని అంటారు.
తరతరాలుగా ప్రజలను బానిసలుగా చూస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్న దొరలను, దొర గడీల వ్యవస్థను కూల్చిన సాయుధ పోరాటం తెలంగాణ నేలపై జరిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించి దేశమంతా ఉత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణలో ఆ ఛాయలు లేవు. తమ బతుకులను మార్చు కునేందుకు ‘దున్నేవానిదే భూమి’ నినాదం తో తెలంగాణలో పోరాటం జరిగింది. 1947 సెప్టెంబర్ 11వ తేదీన మొదలైన ఆ పోరాటం 1948 సెప్టెంబర్ 17 వరకు కొనసాగింది. ఖాసిం రజ్వీ సైన్యం తెలంగాణను గాయపరి చింది. కారం పొట్లాలు, రోకలి బండలు, బరి సెలు, వడిసెల రాళ్లతో మొదలైన పోరాటం అంతిమంగా సాయుధమైంది. బందగీ త్యాగంతో మొదలైన భూపోరాటం, ఐలమ్మ బువ్వగింజల పోరుగా, దొరగడీని కూల్చి వేసిన దొడ్డి కొమరయ్య మహాప్రస్థానంగా సాగింది.
స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపు కోవలసిన తెలంగాణ ఎందుకు తుపాకి పట్టి నెత్తురు ముద్దగా మారిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఉక్కు మనిషిగా మారిపోయింది. సోషలిస్టు తరహా ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తానని హామీలు ఇచ్చి న నేతలు కూడా ఒక్క మాటైనా చెప్పకుండా సైనిక చర్యకు ఉపక్రమించారు. ఫలితంగా 4,000 మంది అమరులయ్యారు. ఆ అమ రుల నెత్తురు నుంచే దేశంలో భూసంస్కరణల అమలు చట్టాలు ప్రభవించాయి. ఇది తెలంగాణ చరిత్ర.
తెలంగాణ సాయుధ పోరుకు అంకురార్పణ జరిగి ఈ సెప్టెంబర్ 11కు 66 సంవ త్సరాలైంది. జులై 4, 1946న జరిగిన దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతో కమ్యూనిస్టుల తిరుగుబాటు ప్రారంభమైందని చెప్పినా, రావి నారాయణరెడ్డి (ఆంధ్ర మహాసభ అధ్య క్షుడు), బద్దం ఎల్లారెడ్డి (తెలంగాణ కమ్యూ నిస్టు పార్టీ కార్యదర్శి), మగ్దూం మొహి యుద్దీన్ (అఖిల హైదరాబాద్ రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షుడు) ఇచ్చిన పిలుపుతో 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరు ప్రారంభ మైందంటారు. ఈ త్యాగాల చరిత్రను కొత్త తరం రక్తంలోకి ఎక్కిస్తే మళ్లీ దండ కార ణ్యాలు భగ్గున మండుతాయనో ఏమో కానీ గ్రీన్‌హంట్ సిలబస్‌లు చెబుతున్నారు. 14వ నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు ప్రజలను కదిలించాయి.
ఈ మహాసభల పునాదుల మీదే రైతాంగ పోరాటం రూపు దిద్దుకుంది. ఈ సాయుధ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన కమ్యూనిస్టు నాయకులే ఆ తర్వాత అంతర్జాతీయంగా పేరు గడించారు. ఈ పోరాటం లేకపోతే దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చ లపల్లి సుందరయ్య, చండ్రపుల్లారెడ్డి, తరి మెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, భీమి రెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి లాంటి నేతలు ఉద్భవించేవారు కాదు. ఆ మహత్తర పోరాటాన్ని ప్రఖ్యాత చిత్రకా రుడు చిత్తప్రసాద్ తన చిత్రాలలో లిఖించారు.
ఇప్పుడు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకునేందుకు సిద్ధమైంది. ఇంత మహో జ్వల చరిత్రపైన ఎవరి నీలినీడలు కమ్ముకు న్నాయోగానీ, ఈ తరానికి తెలియకుండా చేస్తున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డా ఈ నేల కున్న గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ఆనాటి సంస్కృతిని, సంప్రదాయాలను, ఆ పోరులో వాడిన ఆయుధాలను, ఆనాటి ప్రజల కట్టుబాట్లను ప్రతిబింబించే పురా వస్తు ప్రదర్శనశాలను నెలకొల్పాలి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి, నల్లా నర్సింహులు లాంటి వేల మంది త్యాగ ధనుల స్ఫూర్తి ఆ మ్యూజియంలో కనిపిం చాలి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు తెలం గాణలో సుమారు 15 వేల మందికి పైగా ఎర్రదారిలో నిలిచి అసువులు బాశారు. ఆ వీరుల స్మృతి చిహ్నంగా, ఈ నాటి మలిదశ పోరాటంలో అసువులు బాసిన వారి స్మృత్య ర్థం ఇండియాగేట్ మాదిరిగా తెలంగాణ గేట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలి. మాతృ భాషలో బోధన కోసం, మాతృ భాష కోసం ఆత్మగౌరవ పోరాటం తెలంగాణలోనే జరిగిం దన్న విషయాన్ని తెలియజేయాలి. ఆ చరి త్రను కొత్తతరం అధ్యయనం చేస్తే ఎందరెం దరో క్యాస్ట్రోలు, చేగువేరలు, భగత్‌సింగ్‌లు, సుభాష్ చంద్రబోస్‌లు అవతరిస్తారు.
- జూలూరు గౌరీశంకర్
అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక
(వీర తెలంగాణలో సాయుధ పోరాటం
ప్రారంభమై నేటికి 66 సంవత్సరాలు)