సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2014లో ఉద్యమ పార్టీగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతుందని టీఆర్‌ఎస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే పూర్తి మెజార్టీ ఉండి కూడా నాలుగున్నరేళ్లకే కాడెత్తేసిందని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ముం దస్తు ఎన్నికలను తెరపైకి తెచ్చారన్నారు.
ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ప్రజ లపై అప్పుల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే చేపట్టిన మిషన్ భగీరథ వల్ల రోడ్లన్నీ గుంతలమయం చేశారని ధ్వజమెత్తారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగబోనన్న కేసీఆర్.. ఇప్పుడు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఆకాంక్షల కోసమే ప్రజాస్వామ్యబద్ధంగా కలిసి వచ్చే పక్షాలతో తాము ఎన్నికల కూటమి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment