సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల మనోభావాలు, ఆశయాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద అమరవీరుల స్థూపం పునర్నిర్మించాలని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఉద్యమకారులు డిమాండ్ చేశారు. చిమ్మపూడి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో.. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దింపుతామని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలిదశ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే ప్రారంభమైందనీ, మలిదశ ఉద్యమంలోనూ జిల్లాకు చెందిన ఎంతో మంది పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. దాడులను తట్టుకొని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment