తెలంగాణ ఉద్యమానికి పునాది నల్లగొండ జిల్లానే
తెలంగాణ ఉద్యమానికి పునాది నల్లగొండ జిల్లానే
Published Mon, Mar 20 2017 10:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
► మంత్రి ఈటల రాజేందర్
మోత్కూరు :నీళ్లు, నిధులు, నియామకాలు కావాలంటూ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమానికి పునాదివేసింది ఉమ్మడి నల్లగొండ జిల్లానేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మోత్కూరు మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మొదట పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నామని కొట్లాడితెచ్చుకున్న తెలంగాణలో కన్నీళ్లు ఉండొద్దనే తపనతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత పాలకులు కార్మిక వర్గాలతో సంఘాలు పెట్టించి ఉద్యమాలు చేయించి వారి సమస్యలను విస్మరించారని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని కులవృత్తులకు సాయం చేస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందని భావించి బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించామన్నారు. భవన నిర్మాణ, రవాణా రంగ కార్మికులకు ప్రమాద బీమా రూ.ఐదు నుంచి రూ.ఆరు లక్షలకు పెంచినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు ఏనాడూ వృత్తిదారులను పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ మాట్లాడుతూ పల్లెజీవన ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఈటల రాజేందర్ కృషితోనే పెద్దపీట వేసిందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్, మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు టి.మేఘారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కె.యాకుబ్‌రెడ్డి, ఎంపీపీ ఓర్సు లక్ష్మీ, వైస్ ఎంపీపీ వంగా లలిత, సర్పంచ్‌లు బయ్యని పిచ్చయ్య, నిమ్మల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు జంగ శ్రీను, జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు కె.శోభన్‌బాబు, నాయకులు కె.ప్రకాశ్‌రాయుడు, ఆనందమ్మ, శైలజ, కమలమ్మ, పొన్నాల వెంకటేశ్వర్లు, బి.వెంకటయ్య, కందుల విక్రాంత్, కోమటి మత్స్యగిరి, పి.రమేశ్ తదితరులు ఉన్నారు.
Advertisement