తెలంగాణ ఉద్యమ పునాదిరాయి ‘బియ్యాల’ | Essay on Biyyala Janardhan rao | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమ పునాదిరాయి ‘బియ్యాల’

Published Fri, Feb 27 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

Essay on Biyyala Janardhan rao

అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేళ. ఎందరో తెలంగాణ వీరయోధుల, అమరుల ఆకాం క్షలకు దర్పణం. ఆ వీర తెలంగాణ అమరుల ముం దు వరుసలో బియ్యాల జనార్దన్‌రావు ప్రథముడు. ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనా ర్దన్‌రావు తెలంగాణ సకల జనుల మనసుల్లో చెర గని ముద్రవేశారు. బియ్యాల తొలి అనుబంధం ఆది వాసులతో, మలి అనుబంధం తెలంగాణ స్వరాష్ట్రం కోసమే.
 
ఆయన వరంగల్ జిల్లా నెల్లికుదురు మం డలం మునిగలవీడు గ్రామంలో కిషన్‌రావు, అంజనమ్మలకు 1955, అక్టోబర్ 12న జన్మించారు. చిన్న నాటి నుంచి తనకు ఏజెన్సీ గూడేల ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధంతో వారి సాంప్రదాయ, వార సత్వ, జీవన విధానంపై ఆకళింపు కలిగింది. మరో పక్క ఏజెన్సీ భూములు, అటవీ వనరులు పరాయీ కరణ చెందడంపై ఆవేదనతో ఆదివాసీల భూసమ స్యలు, స్వయం పాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి తోడ్పడాలనే సంకల్పంతో కృషి చేశారు.
 
 1983లో కాకతీయ యూనివర్సి టీలో చదువు పూర్తిచేసి, పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకు డిగా చేరారు. ఆ కాలంలో ఆదివాసుల మౌలిక సమస్యలపై దృష్టి పెట్టారు. గిరి జన భూముల పరాయీకరణ అనే అం శంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి గిరిజనేతర వ్యక్తి ఈయనే. ఆ తర్వాత కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫె సర్‌గా విధులు నిర్వర్తిస్తూ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగపు ప్రధానాచార్యునిగా పనిచేశారు.
 
1993- 1995 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీ ఉద్య మాలు, 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమ స్యలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా లోని గోండు గిరిజనుల త్యాగాలకు గుర్తుగా ఇంద్ర వెల్లి అమరులను స్మరించడానికి తరచుగా ఉట్నూ రు, ఆసిఫాబాద్, కెరిమెరి వెళ్లేవారు. 2001లో నేను స్థానిక ఆదివాసీగా ఆయనను కలవడానికి కేయూ హ్యూమానిటీస్ చాంబర్‌లోకి వెళ్తే వెన్ను తట్టి పలక రించిన తీరు మరువలేనిది.
 
ఆయన 62 జాతీయ సెమినార్ లలో, అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రే లియా వంటి దేశాలలో జరిగిన 11 అంత ర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆదివాసుల స్వయం పాలనపై అనేక వ్యాసాలు రాశారు. 1993-95 మధ్య ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్’ న్యూఢిల్లీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. జర్మనీ సామాజిక శాస్త్రవేత్తల సహ కారంతో ‘మూడవ ప్రపంచ దేశాల పాలనా వ్యవ స్థ-అభివృద్ధి’ గ్రామీణ గిరిజన సమాజాల అధ్యయ నం, దేశీయ వనరుల వినియోగం, వలసవాద సమ కాలీన ప్రభుత్వ విధానాల విశ్లేషణలపై దృష్టి సారించారు.
 
మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి సిద్ధాం తకర్తగా కీలక భూమిక పోషించారు. తెలంగాణపై వివక్ష, అణచివేత గురించి అనేక రచనలు చేశారు. అదే కాలంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో కలసి అమె రికాలో జరిగిన ‘తానా’ సభల్లో పాల్గొని ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అసమానతలు, ప్రాంతీయ అసమానతలపై ప్రసంగించి మలి తెలంగాణ పోరు కు అంతర్జాతీయ సమ్మతిని కూడగట్టారు. సమైక్య రాష్ట్రంలో ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ పంపిణీ ల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తొలిసారిగా లేవనెత్తిన ఘనత తనకే దక్కుతుంది.
 
మూడు తరాల ప్రతినిధి కాళోజీ, జయశంకర్ లతో సమ ఉజ్జీగా నిలిచి వారితో కలసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. 2001లోనే నేటి ‘తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్)’’ ఉద్యమ పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. ఆదివాసీ ఉద్యమానికి తన తోడ్పాటు అందిస్తూ, జీవితాంతం స్వరాష్ట్ర సాధన కోసం తపన పడ్డారు. అకాలంగా ప్రొఫెసర్ జనార్దన్ 2002, ఫిబ్రవరి 27న (మేడారం జాతర సమయంలో) ప్రకృతి ఒడిలోకి చేరిపోయా రు. ఆయనను మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మా తగా ప్రభుత్వం గుర్తింపునిచ్చి గౌరవించాలి.
 (నేడు బియ్యాల జనార్దన్‌రావు 13వ వర్ధంతి)
 గుమ్మడి లక్ష్మీనారాయణ
 ఆదివాసీ రచయితల సంఘం. మొబైల్: 9951430476

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement