Biyyala Janardhan rao
-
జనప్రియుడేడమ్మా... జనార్ధనేడమ్మా..
‘ఆదివాసుల ఆత్మాబంధువు యాడికెళ్ళెనే... అడవి బిడ్డల తోడు నీడ ఏమైపోయనే... జనప్రియుడేడమ్మా... జనార్ధనేడమ్మా... తన గుండెలాగిపోయినా... మన గుండె చప్పుడాయన!’ ఈ పాట ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ (biyyala janardhan rao) సార్ జీవనశైలినీ, ఆయన ఆదివాసీల కోసం తపించిన తీరునూ మన కళ్ళకు కడుతుంది.1955 అక్టోబర్ 12న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు (Nellikuduru) మండలంలోని ముని గలవీడు గ్రామంలో జన్మించిన జనార్దన్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘గిరిజన భూముల పరాయీకరణ’ అనే అంశంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్డీ పట్టాపొందారు. అటవీ సంపదంతా ఆదివాసీలకే దక్కాలని, అది పరాయీకరణ కాకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పోరాడారు. తెలంగాణ నీళ్ళు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే దక్కాలనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ కోసం అనాడే పోరాటం చేయమన్నారు. తాను సైతం అందులో భాగమయ్యారు. అధ్యాపకుడిగా ఉంటూనే ఆదివాసీలపై అత్యంత మమకారాన్ని పెంచుకున్నారు. కాకతీయలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆదివాసీల భూసమస్యలు, స్వయంపాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి కృషి చేశారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) సార్‌తో కలిసి అమెరికాలో జరి గిన ‘తానా’ సభల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ అవశ్యకతను వివరించారు. మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండాలని ఆ దిశగా ప్రయత్నం చేశారు. తెలంగాణపై వివక్ష, అణచివేతలపై అనేక రచనలు చేశారు. 1999లో కన్నబిరాన్, ఎస్.ఆర్. శంకరన్ తదితరులతో ప్రభుత్వం తరఫున నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని ఎజెండాను ముందుకు తెచ్చారు. చదవండి: ఈ సైకోల నుంచి రక్షణ లేదా?2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. చివరకు 2002 ఫిబ్రవరి 27న జనార్దన్ సార్ కన్నుమూశారు. ఆయనకు స్వరాష్ట్రంలో ఇప్పటివరకు సముచిత స్థానం దక్కలేదు. ఆయన స్మృత్యర్థం ప్రభుత్వం ఒక గ్రంథాలయాన్నో, విగ్రహాన్నో నెలకొల్పి, గౌరవించాలి.– కలువకొలను హరీష్‌రాజు, జర్నలిస్టు(ఫిబ్రవరి 27న ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్‌రావు వర్ధంతి) -
ఆదివాసీల ఆత్మబంధువు జనార్ధన్
అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణం బియ్యాల జనార్ధన్ రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్ధనరావు వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు గ్రామంలో కిషన్‌రావు, అంజమ్మలకు 1955 అక్టోబర్ 12న జన్మించారు. చిన్నతనం నుంచి ఏజెన్సీలోని ఆదివాసీలతో అనుబంధ కారణంగా వారి సంప్రదాయం, జీవన విధానంపై అవగాహన కలిగింది. ఆదివాసీల సమస్యలు, స్వయం పాలన, రాజ్యాంగ రక్షణ, హక్కుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. 1983లో కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడిగా చేరారు. ఆదివాసుల భూముల పరాయీకరణపై 1985లో పీహెచ్డీ పట్టా పొందారు. ఆదివాసీలపై పరిశోధన చేసి పట్టా పొందిన తొలి గిరిజనేతరుడు జనార్ధన్‌రావు. 1993–2000 మధ్య కాలంలో ఆది వాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, పీసా చట్టం, గ్రామీణ సమస్యలపై దృష్టి సారించారు. అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియాలలో జరిగిన సెమినార్లలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ వారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. తెలంగాణపై వివక్ష, అణచివేతపై అనేక రచనలు చేశారు. ప్రముఖ కవి కాళోజీ, ప్రొఫె సర్ జయశంకర్‌లతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పర్యవసానాలు, ఆదివాసీల జీవన విధ్వంసంపై ఎన్నో వేదికలపై చర్చించారు. ఉసిళ్ల పుట్టలై మన పని, పాటల్ని కమ్మేస్తున్న దొంగ టీవీ చానళ్లను తీసేసి, మన జనపదాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎన్నోరకాలుగా ఎండగట్టారు. ఆదివాసీలు రాజ్యాధికారంలో భాగమై, స్వయం పాలన సిద్ధించిన నాడే జనార్ధన్ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆదివాసీ సంఘాలు, మేథావులు జనార్ధ న్ను స్ఫూర్తిగా తీసుకుని ఆదివాసీల సమస్యలపై పోరాటాలను ముందుకు తీసుకువెళ్లాలి. వ్యాసకర్త: ఊకె రామకృష్ణ దొర, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత -
తెలంగాణ ఉద్యమ పునాదిరాయి ‘బియ్యాల’
అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేళ. ఎందరో తెలంగాణ వీరయోధుల, అమరుల ఆకాం క్షలకు దర్పణం. ఆ వీర తెలంగాణ అమరుల ముం దు వరుసలో బియ్యాల జనార్దన్‌రావు ప్రథముడు. ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనా ర్దన్‌రావు తెలంగాణ సకల జనుల మనసుల్లో చెర గని ముద్రవేశారు. బియ్యాల తొలి అనుబంధం ఆది వాసులతో, మలి అనుబంధం తెలంగాణ స్వరాష్ట్రం కోసమే. ఆయన వరంగల్ జిల్లా నెల్లికుదురు మం డలం మునిగలవీడు గ్రామంలో కిషన్‌రావు, అంజనమ్మలకు 1955, అక్టోబర్ 12న జన్మించారు. చిన్న నాటి నుంచి తనకు ఏజెన్సీ గూడేల ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధంతో వారి సాంప్రదాయ, వార సత్వ, జీవన విధానంపై ఆకళింపు కలిగింది. మరో పక్క ఏజెన్సీ భూములు, అటవీ వనరులు పరాయీ కరణ చెందడంపై ఆవేదనతో ఆదివాసీల భూసమ స్యలు, స్వయం పాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి తోడ్పడాలనే సంకల్పంతో కృషి చేశారు. 1983లో కాకతీయ యూనివర్సి టీలో చదువు పూర్తిచేసి, పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకు డిగా చేరారు. ఆ కాలంలో ఆదివాసుల మౌలిక సమస్యలపై దృష్టి పెట్టారు. గిరి జన భూముల పరాయీకరణ అనే అం శంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్డీ పట్టా పొందిన తొలి గిరిజనేతర వ్యక్తి ఈయనే. ఆ తర్వాత కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫె సర్గా విధులు నిర్వర్తిస్తూ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగపు ప్రధానాచార్యునిగా పనిచేశారు. 1993- 1995 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీ ఉద్య మాలు, 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమ స్యలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా లోని గోండు గిరిజనుల త్యాగాలకు గుర్తుగా ఇంద్ర వెల్లి అమరులను స్మరించడానికి తరచుగా ఉట్నూ రు, ఆసిఫాబాద్, కెరిమెరి వెళ్లేవారు. 2001లో నేను స్థానిక ఆదివాసీగా ఆయనను కలవడానికి కేయూ హ్యూమానిటీస్ చాంబర్లోకి వెళ్తే వెన్ను తట్టి పలక రించిన తీరు మరువలేనిది. ఆయన 62 జాతీయ సెమినార్ లలో, అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రే లియా వంటి దేశాలలో జరిగిన 11 అంత ర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆదివాసుల స్వయం పాలనపై అనేక వ్యాసాలు రాశారు. 1993-95 మధ్య ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్’ న్యూఢిల్లీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. జర్మనీ సామాజిక శాస్త్రవేత్తల సహ కారంతో ‘మూడవ ప్రపంచ దేశాల పాలనా వ్యవ స్థ-అభివృద్ధి’ గ్రామీణ గిరిజన సమాజాల అధ్యయ నం, దేశీయ వనరుల వినియోగం, వలసవాద సమ కాలీన ప్రభుత్వ విధానాల విశ్లేషణలపై దృష్టి సారించారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి సిద్ధాం తకర్తగా కీలక భూమిక పోషించారు. తెలంగాణపై వివక్ష, అణచివేత గురించి అనేక రచనలు చేశారు. అదే కాలంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో కలసి అమె రికాలో జరిగిన ‘తానా’ సభల్లో పాల్గొని ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అసమానతలు, ప్రాంతీయ అసమానతలపై ప్రసంగించి మలి తెలంగాణ పోరు కు అంతర్జాతీయ సమ్మతిని కూడగట్టారు. సమైక్య రాష్ట్రంలో ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ పంపిణీ ల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తొలిసారిగా లేవనెత్తిన ఘనత తనకే దక్కుతుంది. మూడు తరాల ప్రతినిధి కాళోజీ, జయశంకర్ లతో సమ ఉజ్జీగా నిలిచి వారితో కలసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. 2001లోనే నేటి ‘తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్)’’ ఉద్యమ పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. ఆదివాసీ ఉద్యమానికి తన తోడ్పాటు అందిస్తూ, జీవితాంతం స్వరాష్ట్ర సాధన కోసం తపన పడ్డారు. అకాలంగా ప్రొఫెసర్ జనార్దన్ 2002, ఫిబ్రవరి 27న (మేడారం జాతర సమయంలో) ప్రకృతి ఒడిలోకి చేరిపోయా రు. ఆయనను మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మా తగా ప్రభుత్వం గుర్తింపునిచ్చి గౌరవించాలి. (నేడు బియ్యాల జనార్దన్‌రావు 13వ వర్ధంతి) గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసీ రచయితల సంఘం. మొబైల్: 9951430476