జయశంకర్ ఆశయసాధనకు సీఎం కృషి | Jaya Shankar, Chief effort asayasadhanaku | Sakshi
Sakshi News home page

జయశంకర్ ఆశయసాధనకు సీఎం కృషి

Published Mon, Jun 22 2015 12:05 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

Jaya Shankar, Chief effort asayasadhanaku

నల్లగొండ రూరల్
 తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయసాధనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలు అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సైదాంతిక పునాదిని ఏర్పరిచిన దార్శనికుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏపీ సీఎం అనేక కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.
 
  ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు అభిమన్యు శ్రీనివాస్, మున్సిపల్ వైస్‌చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న, బోయపల్లి కృష్ణారెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి, సింగం రాంమోహన్, చింతా శివరామకృష్ణ, పున్న గణేష్, జమాల్, కౌన్సిలర్ దండెంపల్లి సత్తయ్య, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి మహేందర్, జయమ్మ, విమలమ్మ, అండాలు, సావిత్రి, రామేశ్వరి, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement