కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ఎంపీ కవిత వెల్లడించారు.
హైదరాబాద్: కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ఎంపీ కవిత వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మేడే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తే అడ్డుకుంటామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.