
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో...
సుమన్, శివకృష్ణ, ప్రీతీనిగమ్, మధుబాల ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘త్యాగాల వీణ’. తుమ్మల రమేష్‌రెడ్డి సమర్పణలో మిరియాల రవికుమార్ దర్శకత్వంలో కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, పోస్టర్‌ను మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక రాష్ట్రం కోసం ఏ దేశంలోనూ ఇప్పటివరకు ఇన్ని ఆత్మబలిదానాలు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రను భావి తరాలకు తెలియజెప్పాలనే ఈ సినిమా తెరకెక్కించాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా చిత్రాన్ని అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తయింది. జులైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత రమేష్‌రెడ్డి చెప్పారు.