'తెలంగాణ దేవుడు' వచ్చేస్తున్నాడు | Hero Srikanth To Play Lead Role In Telangana Devudu Movie | Sakshi
Sakshi News home page

'తెలంగాణ దేవుడు'.. కేసీఆర్‌ పాత్రలో శ్రీకాంత్‌

Published Mon, Nov 8 2021 7:43 AM | Last Updated on Mon, Nov 8 2021 8:12 AM

Hero Srikanth To Play Lead Role In Telangana Devudu Movie - Sakshi

ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్‌ వడత్యా దర్శకత్వంలో మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించారు. జిషాన్‌ ఉస్మాన్‌ హీరోగా సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్‌ , తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు.

ఈ నెల 12న సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘‘1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి, ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్రతో ఈ సినిమా రూపొందించాం. ఉద్యమం చేసి, సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఏర్పడిన పరిణామాలను చూపించాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: మహ్మద్‌ ఖాన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement