దాశరథి పురస్కార ప్రదానం
హైదరాబాద్ : తెలంగాణ నా కోటి రతనాల వీణ అన్న మహాకవి దాశరథి వ్యాఖ్య తెలంగాణ ఉద్యమంలో సాహసోపేతంగా స్ఫూర్తిని నింపిందని హైకోర్ట్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘసేవ, సాంస్కృతిక సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో మహాకవి దాశరథి 89వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భాష సాంస్కృతిక అధ్యక్షుడు తెలుగు శాఖ ఏవీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డికి దాశరథి పురస్కార ప్రదానం ముఖ్యఅతిధి జస్టిస్ నరసింహా రెడ్డి చేతుల మీదుగా జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, ఉత్తమ ఉపాధ్యాయిని హైమావతిభీమన్న, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రముఖ రచయిత ఘనపురం దేవేందర్, రూరల్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ డెరెక్టర్ ఎస్.గోవర్థన్‌రెడ్డి, సంస్థ అధ్యక్షుడు ఎ.సురేం దర్, చైర్మన్ సుంకర జయప్రకాష్ నారాయణ, కన్వీనర్ దయాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథిగా జస్టిస్ నరసింహారెడ్డి చేతుల మీదగా దాశరథి కుమారుడు దాశరథి లక్ష్మణ్, దాశరధి కుమార్తె ఇందిర, అల్లుడు గౌరి శంకర్‌లను ఘనంగా సన్మానించారు.