Dasarathi Krishnamacharya
-
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ దివిలో విరిసిన పారిజాతమోఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమోనా మదిలో నీవై నిండిపోయెనే...ఈ పాట ఉన్న సినిమా పేరు చాలామందికి తెలియకపోవచ్చు. సినిమా విడుదలయ్యి 50 సంవత్సరాలయ్యిందని కూడా తెలియకపోవచ్చు. హీరో ఎవరో. హీరోయిన్ ఎవరో. కాని పాట నిలిచింది. రాసిన దాశరథి నిలిచారు. పాడిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా. ‘నిదుర మబ్బును మెరుపు తీగవై కలను రేపినది నీవే’ అని ఇదే పాటలో రాశారు దాశరథి. సినిమా సంగీత ఆకాశంలో కొన్ని నిదుర మబ్బులను తన రాకతో దాశరథి చెదరగొట్టారు. కొన్ని దివ్య పద ద్వారాలను తెరిచారు.దివి నుంచి భువికి దిగి వచ్చె దిగి వచ్చెపారిజాతమే నీవై నీవైఇది ‘తేనె మనసులు’ కోసం దాశరథి రాశాక కె.వి.మహదేవన్ ట్యూన్ చేసిన పాట. కాని ‘ఇద్దరు మిత్రులు’ కోసం సాలూరి రాజేశ్వరరావు హార్మోనియం పెట్టెను ముందరేసుకుని ‘మీరు ట్యూన్‌కి రాస్తారా, రాస్తే నన్ను ట్యూన్ చేయమంటారా?’ అని అడిగారు దాశరథిని. బహుశా దాశరథి ఆ క్షణంలో నవ్వుకుని ఉంటారు. నిజాము మీద యుద్ధగళం విప్పి వరంగల్ జైలులో బందీ అయినపుడు ఒక రాత్రి ఆయనను ఉన్నట్టుండి ఇతర రాజకీయ ఖైదీలతో కలిపి నిజామాబాద్ జైలుకు బయలుదేరదీశారు పోలీసులు.అది డిసెంబర్ నెల. రాత్రి. భయంకరమైన చలి. ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియని అయోమయం. దాశరథి ఆ చలిలో, బిక్కచచ్చిన తోటి రాజకీయ ఖైదీలను ఉత్తేజపరుస్తూ కవిత్వం అందుకున్నారు. ఆశువుగా. తెగిపడే కంఠంతో. ఒక్కో కవితా కాగడ. వెచ్చదనం రాజేస్తున్న నెగడు.అలాంటి దాశరథికి– పళ్లు తోముకోవడానికి బొగ్గుముక్క ఇస్తే జైలు గోడలను కవిత్వంతో నింపిన దాశరథికి– ట్యూన్ ఇస్తే ఎంత. నేరుగా రాయమంటే ఎంత. ‘ఎలాగైనా పర్వాలేదండీ’ అన్నారు దాశరథి. సాలూరు ట్యూన్ ఇచ్చారు. ‘నేను తాంబూలం వేసుకు వస్తాను. ఆలోచిస్తూ ఉండండి’ అని బయటకు వెళ్లి వచ్చిన ఆయన ఎర్రబడ్డ నోటిని ఆశ్చర్యంతో తెరిచారు. పల్లవి రెడీ!ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూహుషారు గొలిపేవెందుకే నిషా కనులదానాఈ ఖుషీ ఆ నిషా అప్పటి వరకూ తెలుగు పాట ఎరగదు. ఇది దాశరథి ఇచ్చిన హైదరాబాద్ టచ్. దక్కనీ మిఠాస్. పాట హిట్ అయ్యింది. దాశరథి నుంచి ‘గాలిబ్ గీతాల’ సంపుటిని అంకితం తీసుకున్నందుకు అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’ ద్వారా ఇచ్చిన అవకాశం కవికి విజయావకాశంగా మారింది. తెలుగు పాట దాశరథిని చూసి ఇలా అంది –నా కంటి పాపలో నిలిచిపోరానీ వెంట లోకాల గెలవనీరాఇద్దరు హైదరాబాద్ కవులు ఒక సంవత్సరం తేడాలో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. మొదట అక్కినేని ద్వారా దాశరథి (1961). తర్వాత ఎన్టీఆర్ ద్వారా సి. నారాయణ రెడ్డి (1962). దాశరథిది మొదటి నుంచి పోరుగీతం. ఆయన స్వయంగా నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు. అజ్ఞాతంలో ఉన్నారు. జైలులో బాధలు పడ్డారు. ఆల్ ఇండియా రేడియోలో 1956 నుంచి ’71 వరకూ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ సినిమా కవిగా అవకాశాలు ఉపయోగించుకున్నారు.1977 నుంచి ’83 వరకు అంటే ఎన్టీఆర్ వచ్చి రద్దు చేసే దాకా దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరు ఆస్థానకవి. ఆ పదవిలో ఉండగా సినిమా గీతాలు ఆయన పెద్దగా రాయలేదు. దానికి తోడు 1987లో 62 ఏళ్ల వయసులో ఎదురైన అకాల మరణం దాశరథికి సుదీర్ఘ సినిమా కెరీర్ లేకుండా చేసింది. ఆయన సుమారు 620 పాటలు రాసి ఉండవచ్చు. రాసింది తక్కువైనా హిట్ అయినవి ఎక్కువ. చెట్టు పిట్ట కూడా పాడుకున్న పాట ఆయనది.గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుందిసెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముందిఅన్నపూర్ణ, ఆదుర్తి ఇలా ఒకటి రెండు అనుబంధాలు తప్ప దాశరథి ప్రత్యేకంగా ఏదో ఒక గ్రూప్‌తో లేదా సంస్థతో కలిసి ఉన్నట్టు లేదు. సినిమా రంగంలో ప్రతిభతో పాటు పి.ఆర్ కూడా ముఖ్యం. తిరగబడే కవికి అలాంటి స్వభావం తక్కువ. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత ఉడుకునెత్తురు కవికి సినిమాలో ఆవేశ కావేశాల పాటలు ఏమాత్రం దక్కలేదు. చాలా మటుకు ప్రేమగీతాలు, ఎన్నటికీ మాయని యుగళగీతాలు.ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదిఎన్నటికీ మాయని మమత నాది నీదిదాశరథి కుటుంబ అనుబంధాలను రాశారు. ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ ఆయనదే. ‘బాబూ వినరా... అన్నాదమ్ముల కథ ఒకటి’... ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’.... అలాగే కవ్వింతలూ రాశారు... ‘అది ఒక ఇదిలే అతనికి తగులే’... భార్య అలక భర్త వేడుకోలు... ‘ఓ చెలి కోపమా... అంతలో తాపమా’... ఊరడింపు ‘గోరొంక గూటికే చేరావు చిలక... భయమెందుకే నీకు బంగారు మొలక’... దరఖాస్తు... ‘విన్నవించుకోనా... చిన్న కోరిక’... ‘కాజల్’ సినిమా కోసం సాహిర్ రాసిన ‘ఛూలేనేదో నాజూక్ హోటోంకో’ విఖ్యాత గీతాన్ని దాశరథి ఎంత కోమలంగా తెలుగు చేశారో చూడండి. ‘తాగాలి’ కాదు ‘తాకాలి’ అన్నారు.నీ లేత గులాబి పెదవులతోకమ్మని మధువును తాకాలిదాశరథికి కృష్ణ అనుబంధం ఉంది. దైవబంధం ఉంది. ఆయన పాటలు ఆలయాల్లో నేటికీ సుప్రభాత గీతాలు. ‘పాడెద నీ నా నామమే గోపాల’... ‘రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య’, ‘కన్నయ్యా... నల్లని కన్నయ్య’... ‘మనసే కోవెలగా... మమతలు మల్లెలుగా... నిన్నే కొలిచెదరా... కృష్ణా’... ‘నేనె రాధనోయి గోపాలా’... ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో’... ‘మము పాలింపగ నడిచి వచ్చితివా’... వాణి జయరామ్‌కు దాశరథి వల్ల దక్కిన పూలసజ్జ వంటి గీతం చూడండి.పూజలు చేయ పూలు తెచ్చానునీ గుడి ముందే నిలిచానుతీయరా తలుపులను రామా...దాశరథికి వీణ ఇష్టం. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు. సినిమా గీతాల్లో కూడా ఆయన ఈ వీణానాదాన్ని పలికించారు. ‘మదిలో వీణలు మ్రోగె’... ‘నీవు రావు నిదుర రాదు’.. ‘వేణుగాన లోలునిగన వేయి కనులు చాలవులే’.... ఇక ఈ పాట?మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనాఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే....నేటి నుంచి దాశరథి శతజయంతి సంవత్సర వేడుకలు మొదలుకానున్నాయి. సినిమా రంగం, సినీ సంగీత రంగం, సినీ గేయకర్తలు, అభిమానులు సమావేశాలు, సంగీత విభావరులు నిర్వహించుకుని దాశరథి పాటలను మళ్లీ తలుచుకుని పాడుకోవాల్సిన సందర్భం ఇది. అయితే మన సినిమా రంగానికి పెద్దగా ఇటువంటి వాటికి సమయం ఉండదు. కాని ప్రజల వద్ద శ్రోతల వద్ద ఉంటుంది. సత్కవిని తమ నాల్కల యందు నుంచి కడిగేసే మూర్ఖులు ఎంతమాత్రం కారు వారు. పాడుకుంటూ ఉంటారు. పాడుతూనే ఉంటారు. వారికి తనివి తీరదు.తనివి తీరలేదే నా మనసు నిండలేదేఏనాటి బంధమీ అనురాగం – కె -
కూరెళ్లకు దాశరథి పురస్కారం
రామన్నపేట : ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను దాశరథి పురస్కారం వరించింది. జూలై 22న దాశరథి కృష్ణమాచార్యులు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారాన్ని అందజేస్తోంది. 2019 సంవత్సరానికిగాను ప్రభుత్వం కూరెళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల లక్ష్మమ్మ–వెంకటరాజయ్యల కుమారుడు కూరెళ్ల విఠలాచార్య. ఆయన ఏడవ తరగతి నుంచే తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. కూరెళ్ల రాసిన 18కి పైగా గ్రంథాలు ఇప్పటివరకు ముద్రితమయ్యాయి. ఆయన సాహితీరంగానికే పరిమితంకాక జిల్లా వ్యాప్తంగా పలు సాంస్కృతిక సంస్థలు, యువజన సంఘాలను నెలకొల్పి సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ఆయనకు మధురకవి, అభినవ పోతన, తెలంగాణ వేమన, నల్లగొండ కాళోజీ తదితర బిరుదులు ఉన్నాయి. -
దాశరథి కృష్ణమాచార్యకి నివాళులర్పించిన కేసీఆర్
-
నేడు దాశరథీకృష్ణమాచార్య జయంతి
-
దాశరథి పురస్కార ప్రదానం
హైదరాబాద్ : తెలంగాణ నా కోటి రతనాల వీణ అన్న మహాకవి దాశరథి వ్యాఖ్య తెలంగాణ ఉద్యమంలో సాహసోపేతంగా స్ఫూర్తిని నింపిందని హైకోర్ట్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘసేవ, సాంస్కృతిక సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో మహాకవి దాశరథి 89వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భాష సాంస్కృతిక అధ్యక్షుడు తెలుగు శాఖ ఏవీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డికి దాశరథి పురస్కార ప్రదానం ముఖ్యఅతిధి జస్టిస్ నరసింహా రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, ఉత్తమ ఉపాధ్యాయిని హైమావతిభీమన్న, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి, ప్రముఖ రచయిత ఘనపురం దేవేందర్, రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డెరెక్టర్ ఎస్.గోవర్థన్‌రెడ్డి, సంస్థ అధ్యక్షుడు ఎ.సురేం దర్, చైర్మన్ సుంకర జయప్రకాష్ నారాయణ, కన్వీనర్ దయాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథిగా జస్టిస్ నరసింహారెడ్డి చేతుల మీదగా దాశరథి కుమారుడు దాశరథి లక్ష్మణ్, దాశరధి కుమార్తె ఇందిర, అల్లుడు గౌరి శంకర్లను ఘనంగా సన్మానించారు. -
లాహిరి లాహిరి 13th Sept 2013
-
మొక్కక తప్పని చిల్లర దేవుళ్లు
లంబాడోళ్లు ఊరి మీద పడ్డారు. పెద్ద పెద్ద బాణాకర్రలు పట్టుకుని, జొన్నపిండి మూట గట్టుకుని, పిల్లా జల్లా ముసలీ ముతకా అంతా ఊరి మీద పడ్డారు. కరణం ఇంటి ముందు బైఠాయించారు. కరణం తండ్రి గతంలో వాళ్లకు ఠస్సా ఇచ్చాడు. డబ్బు తీసుకొని భూమి ఎగ్గొట్టాడు. కరణం చేతిలో ఇప్పుడు అధికారం ఉంది. తలుచుకుంటే భూమి ఇవ్వగలడు. కాని లంబాడోళ్లకు న్యాయంగా రావల్సిన భూమిని అతడు ఊరి పెద్ద నారయ్యకు అమ్ముకున్నాడు. దాని రాబడి అంతా నారయ్యే తింటున్నాడు. పాపం నోరులేని లంబాడోళ్లు. డబ్బూ పోయి భూమీ పోయి. అందుకే ఐసల్ ఫైసల్ తేల్చుకుందామని ఉగ్రంగా ఊరి మీద పడ్డారు. ఇది తెలిసి కరణం గడగడా వొణికి ఇంట్లో దబ్కాయించాడు. ఊరి జనం తలుపులు బిడాయించుకుని సందుల్లో నుంచి భయం భయంగా మిర్రిమిర్రి చూస్తున్నారు. ఏ క్షణాన ఏదైనా జరగొచ్చు. కరణం ప్రాణాలు తీయడం ఖాయం. కాని ఆశ్చర్యం. తలుపు తీసుకుని కరణం ధైర్యంగా బయటకు వచ్చాడు. ‘ఏంరా లంజకొడుకుల్లారా. ఇంటి మీదకి హమ్ల చేయడానికి వస్తార్రా’ అని మీసం దువ్వాడు. ‘అదిగో కరణం’ అని లేచారు లంబాడోళ్లు. ఢాం. పిస్తోలు పేలింది. లంబాడోళ్లు అదిరిపడ్డారు. అమీన్ సాబ్. పోలీసులు. ఢాం... ఢాం... పేల్చుకుంటూ ఊడిపడ్డారు. దొరికినవాణ్ణి దొరికినట్టు తన్నారు. ఆడవాళ్ల సిగలు పట్టుకొని గుంజారు. చెట్లకు కట్టేశారు. కరణం అమీన్ సాబ్‌కు సారాయి పోయించి, విషం ఎక్కించి, చూపు ఆడవాళ్ల మీదకు పోనిచ్చాడు. ఒక లంబాడాది. మంచి వయసు మీద ఉన్నది. చచ్చింది. దాని మొగుడు? చచ్చాడు. అమీన్ సాబ్ ఇదంతా ఊహించలేదు. ఊరి మీదకు లంబాడోళ్లు వచ్చారు... ఇంటికొక రూపాయి ఇప్పిస్తాను... రక్షణగా రండి అని కరణం అంటే వచ్చాడు. ఆ చిల్లర ఇక్కడి దాకా తెచ్చింది. పోతే పోయాయి దిక్కులేని ప్రాణాలు. చిల్లరైతే చేతికి దక్కింది. ఇదీ- చిల్లర దేవుళ్లు నవలలో ఒక భయానక సన్నివేశం. ఏం బతుకులు అవి. నైజాం పాలకుని కాలంలో బతుకులు. పటేళ్లు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌లు, దేశ్ పాండ్యాలు, భూస్వాములు.... అంతా పీక్కు తింటున్నారు. మూలవిరాట్టు- నైజాం నవాబు- పేరు చెప్పి ఈ చిల్లర దేవుళ్లందరూ ఊరేగుతున్నారు. వీరితో పోలీసులు మిలాఖాత్. దొర రామారెడ్డి తక్కువ తినలేదు. ఆ ఊరికి పేరు లేని దేవుడతడు. గడి కట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని, మదార్ సాబ్ వంటి కిరాతకులను రక్షణగా ఉంచుకొని, కరణం వంటి గుంటనక్కను పక్కన పెట్టుకొని... ఊరి మనుషులు బానిసలు. నీ బాంచన్ అని మోకాళ్ల మీదకు వొంగి, అరి చేతులను నేల మీద ఆనించి, ఆ మట్టిని ముఖానికి రాసుకుంటే తప్ప దొర దర్శనం ఇవ్వడు. రెండు కుండల గింజలు కావాలంటే దొరకు మొక్కాలి. సర్కారు తోపులో నాలుగు చింతకాయలు తెంపాలంటే దొరకు మొక్కాలి. పిల్లకు లగ్గం చేయాలంటే మొక్కాలి. ఏదైనా తకరారు వస్తే మొక్కాలి. భార్య, ఎదిగి ఏపుగా తయారైన కుమార్తె మూడో కంటికి కనపడరు. కాని ఊరి ఆడవాళ్లందరూ దొర కంట్లో పడాలి. వారు చల్లంగుండాలంటే దొరను చల్లబరచాలి. ఎక్కువ నచ్చితే గడిలో ఉంచుకుంటాడు. లేదంటే ఆడబాపను చేస్తాడు. ఆడబాప అంటే దాసి. అతిథుల శరీర సౌఖ్యాలను కూడా చూడాల్సిన బానిస. వనజ! ఎంత చక్కనిది. ఆ గడిలో ఆడబాప. పాపం దాని తల్లి ఎవరో. దొరే చెరబట్టాడు. కూతురు పుడితే కనికరం లేకుండా ఆడబాపను చేశాడు. అందరికీ తెలిసిన పాపాలు ఇవి. కాని ఎవరూ ఏమనకుండా నోరు కుట్టుకుని ఉండాలి. కరణం మాత్రం తక్కువా? మొగుణ్ణే బొందల పెట్టి వాని భార్యను ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ హైద్రాబాద్ దాకా పోతాయా? దర్బార్ వరకూ చేరుతాయా? ఆలా హజ్రత్- నిజామ్ ఉల్ ముల్క్- సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు తెలుస్తాయా? ఈ గొడవ ఇలా ఉండగా అసలు దేవుళ్ల గొడవ ఇంకొకటి. ఇంత పెద్ద హైద్రాబాద్ స్టేట్, ఇంత పెద్ద ‘తురక’ పాలన, కాని రాష్ట్రంలో ఇంకా హిందువులు కనిపిస్తున్నారే. బ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు, యాదవులు, గౌండ్లు... కడాన మాలలు, మాదిగలు. అల్లాహ్ పర్వర్దిగార్ వెలుగు వీరిని చేరదా? ఇస్లాం అజాన్ వీరికి వినిపించదా? తమ సరసన కూచోబెట్టుకోకుండా తాకితే మైల అని, చదువుకుంటే చెవుల్లో సీసం పోస్తామని, ఎదురు తిరిగితే కోసి పాతరేస్తామని హిందువులు అణచి ఉంచిన దళితులను కదా మొదట విముక్తం చేయాల్సింది. నిజాం తలపోత ఏదైనా చుట్టూ ఉండే చిల్లర దేవుళ్లు ఇస్లాం మార్పిడులు మొదలుపెట్టారు. మగాళ్ల మొలతాళ్లు తెంచి, తలలు గొరిగి, ఆడవాళ్ల మంగళ సూత్రాలు తెంచి, బొట్టు చెరిపి, వాళ్లను ఇస్లాంలోకి తెచ్చే పని. రెండు మంచి నీటి బావులు, నాలుగు కొత్త బట్టలు ఇస్తే దరిద్రులకు ఏ మతమైతే ఏంటి? ఇది క్రియ. దానికి ప్రతిక్రియ? చాలా సులభం. రాత్రికి రాత్రి రావడం. సీసాలో నుంచి కాసింత గంగా జలం మీద చిలకరించడం. మళ్లీ హిందువులను చేయడం. మన అల్లాహ్ గొప్పవాడు. మన హిందూమతానికి వేల ఏళ్లు. ఏ దేవుడు ఎలాగున్నా డబ్బున్న ముస్లిం మాసిన గడ్డాం వాణ్ణి కావలించుకోడు. పై కులంవాడు మాదిగ సరసన కూచుని ముద్ద ముట్టడు. చిల్లర బతుకులు ఎప్పటికీ చిల్లర బతుకులే. ఇత్తహాదుల్ ముస్లమీన్ పుట్టింది. ప్రతిగా ఆర్య సమాజ్ ఆవిర్భవించింది. హిందూ మతానికి ఆలంబనగా తెలుగు భాష పేరున ఆంధ్ర జన సంఘం ఊపిరిపోసుకుంది. దేవుళ్ల హస్తముద్రల కింద, చిల్లర దేవుళ్ల ఇనప పాదాల కింద పుటపుటమని నలిగిపోతున్న జనం హాహాకారాలు. ఇదంతా ఈ నవల కళ్లకు కట్టినట్టు చూపుతుంది. పాత తెలంగాణ పల్లెల్లోకి చేయి పట్టుకుని నడిపించుకుని- వారి వేష, భాష, రీతి, రివాజు, మోటు మనుషుల మానవత్వం, మెత్తనివాళ్ల దుర్మార్గ స్వభావం, అధికారం పేరు చెప్పి పీల్చి పిప్పి చేసే వ్యవస్థ, మిగిలిన అరా కొరా దేవుడి హుండీలో. ఇదంతా కళ్లకు కట్టినట్టు చూపుతుంది. ఈ దుర్మార్గం నుంచి విముక్తి ఎప్పుడు? తమసోమా జ్యోతిర్గమయ ఎప్పుడు? అని వేదనతో చేసిన అక్షర ఆక్రందన ఈ నవల. ఏళ్లు గడిచిపోయాయి. ఇవాళ పాలనలో ఆంధ్ర పెత్తనం ఎక్కువైందని తెలంగాణ ఉద్యమం వచ్చింది. గతంలో హైద్రాబాద్ పాలనలో ముస్లింల పెత్తనం ఎక్కువైందనే ముఖ్యకారణాన నిజాం వ్యతిరేకత ఊపిరిపోసుకుంది. రాష్ట్రాలు విడిపోవచ్చు. కొత్త రాజధానులు ఏర్పడవచ్చు. కాని ఏలికలు మారరు. పాలకులు మారరు. చిల్లర దేవుళ్లూ మారరు. ఇవాళ బీదా బిక్కీ దేశాలను, వారి ఖనిజాలను, వారి ఇంధనాన్ని పీల్చి పిప్పి చేసి బెదిరించి అవసరమైతే అభయ హస్తం చూపించి ఆ చిల్లర మీద బతికే అతిపెద్ద మెగా చిల్లర దేవుడిగా అమెరికా ఆవిర్భవించింది. దీనిని కాచుకోవడం ఒకవైపు. మరోవైపు ఈ ప్రపంచంలో ఇంకా వేరే మతాలు ఉన్నాయా ఇది ఎలా సాధ్యం అని డాలర్లు కుమ్మరించే అగ్రరాజ్యాల క్రిస్టియన్ ఆసాములూ, రాత్రికి రాత్రి అంతా ఇస్లాంలోకి మారిపోలేదేమిటబ్బా అని దినార్లను ముష్టి రాల్చే అరబ్బు పెద్దలూ, మన హిందూ మతానికి ఈ గతి ఏమిరా అని బోరోమని ఏడ్చి, చానెళ్లతో కలిసి అక్కడా ఇక్కడా ఉన్న బీదాబిక్కీలను తిరిగి తమ పవిత్ర గంగాజల పరంపరలోకి తెచ్చే సరికొత్త స్వామీజీలూ... వీరిని కాచుకోవడం ఇంకో వైపు. ఎవరు ఏం చేసినా కథ మాత్రం అంతే. నోరులేనోళ్ల బతుకులంతే. మనిషికి చదువు కావాలని, వికాసం కావాలని, వాడు జ్ఞానం తెచ్చుకుని, ఒకరికి లొంగని బతుకు బతుకుతూ, నలుగురి హితం కోరుతూ, తనలోని దైవాన్ని- తాను తెలుసుకోదగ్గ దైవాన్ని- తెలుసుకునే రోజూ సమాజమూ ఏర్పడనంత కాలమూ ‘చిల్లర దేవుళ్లు’ చిరంజీవి. -
లాహిరి లాహిరి-దాశరధి కృష్ణమాచార్య