తన గోడును ముఖ్యమంత్రికి విన్నవించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఓ యువకుడు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు.
హైదరాబాద్: తన గోడును ముఖ్యమంత్రికి విన్నవించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఓ యువకుడు తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడి భద్రతాసిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నాచారం అంబేద్కర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎ.రాజు కాంట్రాక్ట్ ఉద్యోగి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు అతడి ఉద్యోగం పోయింది. దీంతోపాటు అత డుండే చోట ఓ దేవాలయ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారు. ఈ విషయాలను సీఎంను కలసి విన్నవించేందుకు ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వనందునే ఆత్మహత్యకు యత్నించినట్లు రాజు పేర్కొన్నాడు.