పెట్టుబడిదారీ వ్యవస్థను అణ చివేయాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా వామపక్షాలతోనే సాధ్యమవుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
భద్రాచలం : పెట్టుబడిదారీ వ్యవస్థను అణ చివేయాలన్నా, సమాజంలో మార్పు రావాలన్నా వామపక్షాలతోనే సాధ్యమవుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భద్రాచలంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాలు గురువారం ప్రారంభమయ్యా యి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు కొంతమేర లబ్ధి చేకూర్చేవే అ యినా.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంపై మాట్లడకపోవటం శోచనీయమన్నారు.
1956కు ముందునుంచి ఇక్కడున్న వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తామనడం సరికాదన్నారు. ఇలాంటి నిర్ణయాలతో ఖమ్మం జిల్లా భద్రాచలం, నల్గొండ జిల్లా మునగాల ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. పొట్టకూటి కోసం హైద్రాబాద్‌లో స్థిరపడ్డ కొన్ని కుటుం బాలకు అన్యాయం జరుగుతందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నిర్ణయాలతో కొత్త సమస్యలు ఉ త్పన్నమవుతాయని హెచ్చరించారు. ఇంకా మంత్రి వర్గం తీసుకున్న పలు సాహసోపేత నిర్ణయాలను తమపార్టీ అభినందిస్తోందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై విధించిన కేసులతో పాటు భూమి, ఇల్లు, మౌలిక సదుపాయాల కోసం చేసిన ప్రజా పోరాటాలలో పాల్గొన్న వారిపై వి ధించిన కేసులను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చే శారు. పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర రాష్ర్టంలో కలుపుతూ లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం తెలి పిన బిల్లును రాష్ట్రపతి అయినా తిరస్కరించాలని విజ ్ఞప్తి చేశారు.
భద్రాద్రి రాముడికి గిరిజనులకు ఏళ్ల తరబడి విడదీయరాని బంధం ఉందని, ఇప్పుడు ఆ బంధాన్ని వేరు చేయాలనుకోవడం అన్యాయమని అన్నారు. 5వ షెడ్యూల్‌లో గిరి జనులకు ప్రత్యేక చట్టాలున్నాయని, దీని ప్రకారం బి ల్లుకు గ్రామసభల ఆమోదం తప్పనిసరని అన్నారు. అయినా వారి మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ముంపు మండలాల కోసం ఎవరు పోరాటాలు చేసినా వారితో కలిసి వస్తామని తెలిపారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కు, నిరుద్యోగులకు, యువతకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చేలా లేదని విమర్శించారు.
మహిళల భద్రతకు బడ్జెట్‌లో స్థానం కల్పించకుండా, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రూ. 200 కోట్లు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తామని, ఆగష్టు 7,8 తేదీలలో జరుగనున్న కేంద్ర కమిటీ సమావేశాలలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య మా ట్లాడుతూ పోలవరం ముంపు మండలాల విషయంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోం దని విమర్శించారు. త్వరలోనే రాష్ట్రపతిని కలిసి బి ల్లుపై సంతకం చేయొద్దని కోరుతామన్నారు.
తొలుత సమావేశాల ప్రారంభ సూచికగా మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించా రు. సమావేశాలలో పార్టీ రాష్ట్ర నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, జూలకంటి రంగారెడ్డి, కాసాని అయిలయ్య పాల్గొన్నారు.