మండలి’ ఓటుకూ మకిలేనా! | Are they in favor of elected members of the legislature? | Sakshi
Sakshi News home page

మండలి’ ఓటుకూ మకిలేనా!

Published Tue, May 26 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

మండలి’ ఓటుకూ మకిలేనా!

మండలి’ ఓటుకూ మకిలేనా!

డేట్‌లైన్ హైదరాబాద్
 
ఈ ఐదుగురు అభ్యర్థుల పట్లా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చి, శాసన సభ్యులుగా ఎంపికైన వారు సుముఖంగానే ఉన్నారా? అటువంటివారు రహస్య బ్యాలెట్‌ను అనుసరిస్తే ఫలితం ఎలా ఉంటుంది? మన మేధావి జగదీశ్వర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. అయినప్పటికీ, ఐదు స్థానాలూ అధికార పక్షమే గెలుస్తుందని ఘంటాపథంగా అంటారా? ఇక, మన రాజకీయాలలోని నీతిని కొనియాడవలసిందే! మండలి ఎన్నికలలో పడే ఓట్ల మతలబు ఏమిటో త్వరలోనే వెల్లడవుతుంది.
 
 అసెంబ్లీ సభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికలు జూన్ ఒక టిన జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలు సాఫీగానే సాగిపోయా యి. నాలుగు స్థానాలకు (వైఎస్‌ఆర్‌సీపీ-1, తెలుగుదేశం-3) ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఎలాంటి సందులేకపోవడంవల్ల కాబోలు అక్కడ అధి కార పార్టీ ఎలాంటి తొండీ పెట్టకుండా ప్రక్రియను సాగనిచ్చింది. నిజానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీ యాలు ఆడడానికి వెనుకాడరు. తెలంగాణలో మాత్రం ఈ తొండి తప్పేటట్టు లేదు. శాసనసభ సభ్యుల కోటా నుంచి ఆరు ‘మండలి’ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసనసభ సభ్యుల సంఖ్యను ఆరుతో భాగిస్తే వచ్చే సంఖ్యతో సమంగా ఒక్కొక్క అభ్యర్థికి ఓట్లు రావాలి. కానీ ఆరు స్థానాల కోసం ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
 
ఐదో స్థానం గెలుపు ధీమా ఎక్కడిది?

ఒకసారి లెక్కలు చూద్దాం. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119. నామినే టెడ్ సభ్యునితో కలిపి 120. శాసనసభ కార్యదర్శి (పదవీకాలం పొడిగిం చారు) రాజా సదారామ్ చెబుతున్నట్టు, రాష్ట్రపతి, రాజ్యసభ ఎన్నికలలో ఓటు అర్హతలేని నామినేటెడ్ సభ్యునికి, మండలి ఎన్నికలలో ఓటు హక్కు ఇస్తే మాత్రమే ఆ సంఖ్యను 120గా పరిగణించాలి. అయితే రాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి అర్హత లేని సభ్యుల ఓటు శాసన మండలి ఎన్ని కలలో మాత్రం ఎలా చెల్లుబాటు అవుతుందో ఎన్నికల సంఘం స్పష్టం చేయా లి. నిజానికి కరీంనగర్ జిల్లా, వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ ఓటు హక్కు కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆయన ఎన్నడో జర్మనీ పౌరస త్వం తీసుకున్నారు. ద్వంద్వ పౌరసత్వం వల్ల ఆయనకు ఈ ఎన్నికలలో ఓటు వేసే హక్కు లేదని తెలుగుదేశం సభ్యుల వాదన. అయితే రమేశ్ ఇప్పటికి ఉప ఎన్నికలతో కలిపి మూడు నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నికవు తూనే ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావడానికి లేని అభ్యంతరం, మండలి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించడం దగ్గర ఎందుకు చెల్లుబాటు కాదో కూడా ఎన్నికల సంఘం వివరించాలి. ఎన్నికల సంఘం ఆ ఇద్దరికీ అనుమతి ఇస్తుందని అనుకుంటే, శాసనసభ్యుల సంఖ్య 120. లేకుంటే 118. శాసన సభలో టీఆర్‌ఎస్ బలం 65 స్థానాలు. అంటే మూడు స్థానాలు మాత్రమే (ఒక్కొక్క అభ్యర్థికి 20 వంతున ఓట్లు పడితే) ఆ పార్టీకి దక్కుతాయి. పోగా కొద్ది ఓట్లు మాత్రం మిగులుతాయి.

శాసనసభలో ఎంఐఎంకు ఏడు ఓట్లు ఉన్నాయి. మొదటి నుంచి నిజాం నవాబు మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్న కారణంగానూ, మజ్లిస్‌తో ఉన్న సఖ్యత కారణంగానూ వారి ఓట్లు కూడా తమకే వస్తాయని టీఆర్‌ఎస్ భావిస్తే, ఆ రెండు పార్టీల ఓట్ల సంఖ్య 72కు చేరుతుంది. అప్పుడు 20తో (ఒక్కొక్క అభ్యర్థికి రావలసిన ఓట్లు) భాగించినా అధికార పార్టీకి దక్కేవి ఆ మూడు స్థానాలే. అంటే, మిగిలి పోయే ఓట్లు కొద్దిగా పెరగడం మినహా, వచ్చే సీట్ల సంఖ్యలో మార్పేమీ లేదు. ఇక ‘బం గారు తెలంగాణ బ్యాచ్’ (బీటీ బ్యాచ్) అని అంతా ముద్దుగా పిలు చుకుం టున్న టీడీపీ, కాంగ్రెస్ వలస సభ్యులు - తొమ్మండుగురిని కూడా కలుపు కుంటే, అధికార పార్టీ బలం 81కి చేరుకుంటుంది. ఈ సంఖ్య ప్రకా రమైతే నాలుగు మండలి స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకోగలదు. 21 స్థానాలు ఉన్న కాంగ్రెస్‌కు ఒక మండలి స్థానం; బీజేపీ-5, తెలుగుదేశం-15 మంది సభ్యులతో ఆ కూటమికి ఒక స్థానం తప్పక చెందవలసిందే. మరి అధికార పార్టీ ఏ ధీమాతో ఐదో స్థానానికి ఆశపడుతున్నట్టు?

ఎవరి వైఖరి ఏమిటి?

 మాకు గొప్ప వ్యూహం ఉందని మంత్రులు చెబుతున్నదంతా డంబాచార మేనా? ‘మేం ఐదు స్థానాలూ గెలుస్తాం, అందుకు చర్చలు జరుపుతున్నాం’ అని  సాక్షాత్తు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గత వారమే ప్రకటిం చారు. అంటే శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసే, కొనుగోలు చేసే కార్య క్రమం మరోసారి జరగబోతున్నదన్నమాట. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అదే జరిగితే తగిన జవాబు చెబుతారు కూడా. ప్రతి అవాంఛనీయ కార్య క్రమానికి బంగారు తెలంగాణ భవిష్యత్తు అంటూ ఒక ముద్రవేసి, వ్యతి రేకించే వారి మీద రంకెలు వేసే అధికార పక్షం ఈ సంగతి గుర్తించాలి.

ఇంతకీ శాసనమండలి ఎన్నికలలో మజ్లిస్ వైఖరి ఏమిటి? అది ఇంకా స్పష్టం కాలేదు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ సంవత్సరాంతంలో గ్రేటర్ మున్సి పల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరపవలసిందేనని న్యాయస్థానాలు చెప్పే శాయి. ఈ నేపథ్యంలో మండలి ఎన్నికలలో మజ్లిస్ మద్దతును బహిరంగంగా తీసుకోవడానికి టీఆర్‌ఎస్ సిద్ధపడుతుందా? పట్టభద్రుల నియోజకవర్గ ఎన్ని కలలో ఉద్యమవీరుడు దేవీప్రసాద్‌కు ఎదురైన ఓటమి అనుభవం నుంచి అధి కార పక్షం పాఠాలు నేర్చుకుని ఉంటే, అందుకు సిద్ధపడదు. నిజానికి టీడీపీ, బీజేపీ కూటమి బలోపేతం కావడానికి ఆ పరిణామం ఉపకరిస్తుంది. మజ్లిస్ కూడా టీఆర్‌ఎస్‌తో దోస్తీకి ఆసక్తి చూపించకపోవచ్చు. కొద్దిమాసాల క్రితం మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిద ర్శనం. కారు (టీఆర్‌ఎస్)తో దోస్తీ విషయం గురించి విలేకరులు అడిగితే, ‘స్టీరింగ్ మా చేతులలోనే ఉంది’ అని ఆయన అన్నారు. ఆ తరువాత పరిస్థి తులు మారాయి. ఆలేరు దగ్గర జరిగిన వికారుద్దీన్ ముఠా బూటకపు ఎన్ కౌంటర్‌తో మజ్లిస్ మిత్రులు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. వీటికి తోడు ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మోదీతో సెల్ఫీలు తీసుకోవడం, ఆయన ఆహ్వానిస్తే ప్రభుత్వంలో చేరే విష యం ఆలోచిస్తామనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మజ్లిస్ సభ్యుల మద్దతు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు లభిస్తుందా?
 
ఇప్పటికీ అదే చిరునామా

 ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంఎల్‌ఏలూ, వారి పార్టీల వివరాలతో శాసనసభ కార్యదర్శి విడుదల చేసిన జాబితాను కూడా పరిశీలించాలి. 120 మంది సభ్యుల ఆ జాబితాలో అధికార పక్షంలోకి వలసపోయిన ఐదుగురు తెలుగుదేశం, నలుగురు కాంగ్రెస్ సభ్యుల పేర్లు ఆయా పార్టీల పరిధిలోనే ఉన్నాయి. ఆ జాబితా ప్రకారం అధికార టీఆర్‌ఎస్ బలం 65 మంది సభ్యులే. మరి తొమ్మిది మంది ‘బీటీ బ్యాచ్’ అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు ఎలా వేస్తారు? ‘ఇది రహస్య బ్యాలెట్ బాబూ!’ అని మేధావి, మంత్రి జగదీశ్‌రెడ్డి నవ్వవచ్చు. కానీ జాబితాలూ, ఆ లెక్కలూ మారవు కదా! ఏమో గుర్రం ఎగరావచ్చునంటారా? సరే చూద్దాం!
 
అభ్యర్థుల సంగతి

ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆకుల లలితను అభ్యర్థిగా ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీ మైనస్ పాయింట్లేమీ లేని నరేందర్‌రెడ్డిని ఎంపిక చేసింది. కానీ టీఆర్‌ఎస్ ఎంపిక చేసుకున్న ఐదుగురు అభ్యర్థులతో ఇబ్బందులకు గుర య్యే అవకాశమే ఎక్కువ. ఈ ఐదుగురు ప్రత్యేక రాష్ట్రం విషయంలో చివరి నిమిషం వరకు టీఆర్‌ఎస్ వ్యతిరేకులే. ఉప ముఖ్యమంత్రి, విద్యామంత్రి కడి యం శ్రీహరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేయించిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యట నకు వస్తే, ప్రతిఘటించిన ఉద్యమకారులను పోలీసులతో చావగొట్టించిన ఘనత కూడా ఆయనదే. ఇప్పుడు ఆయన వరంగల్ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. లోక్‌సభకు ఇంకా ఎందుకు రాజీనామా చేయరు? అని అడిగితే జవాబు లేదు. ఇక్కడ గెలుపు ధీమా లేకనో, అక్కడ ఉప ఎన్నిక నల్లేరు మీద నడక కాదని నమ్మడం వల్లనో మరి? మరో అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తేలాక జరిగిన ఎన్నికలలో కూడా తెలుగు దేశం అభ్యర్థిగానే పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయి, తరువాత టీఆర్ ఎస్‌లో చేరారు. పైగా శ్రీహరి, తుమ్మల- ఈ ఇద్దరినీ కూడా మంత్రివర్గంలో చేర్చుకోవడం గురించి అసంతృప్తితో ఉన్న శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువేమీకాదు.

ఇక మిగిలిన ముగ్గురి గురించి. నేతి విద్యాసాగర్, తెలం గాణ శాసనమండలి ఆధిపత్యం టీఆర్‌ఎస్‌కు అప్పగించినందుకు ప్రతిఫలం గా ఈ అభ్యర్థిత్వం దక్కింది. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన యాదవరెడ్డి నరనరాన రాజకీయ గురువు సూదిని జైపాల్‌రెడ్డి ఆలోచనలే ప్రవహిస్తూ ఉంటాయి. ఐదో అభ్యర్థి బోడకుంట్ల వెంకటేశ్వర్లు- ఆయన టీడీపీ నుంచి వచ్చినవారే. తెలంగాణ సాధన కోసం ఎన్నడూ పనిచేసిన వారు కాదు. ఈ ఐదుగురి పట్లా తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగివచ్చి, శాసనసభ్యులుగా ఎంపికైన వారు సుముఖంగానే ఉన్నారా? అటువంటివారు రహస్య బ్యాలె ట్‌ను అనుసరిస్తే ఫలితం ఎలా ఉంటుంది? మన మేధావి జగదీశ్వర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. అయినా, ఐదు స్థానాలూ అధికార పక్షం గెలుస్తుందని అంటారా? ఇక, మన రాజకీయాలలోని నీతిని కొనియాడవలసిందే!
 datelinehyderabad@gmail.com


http://img.sakshi.net/images/cms/2015-05/71432666330_Unknown.jpg

 

 

 

 
దేవులపల్లి అమర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement