
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యక్తిగత రాజకీయ పరువుకు నష్టం కలిగించేలా మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల పోలీసులను కోరారు. మంత్రి ఫిర్యాదుపై స్పందించిన టూ టౌన్ పోలీసులు భేతి మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment