![T Congress Leader Ponnam Prabhakar Slams Bandi Sanjay - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/19/Ponnam-Prabhakar-Slams-Bandi-Sanjay.jpg.webp?itok=7y-qrebM)
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పాన్సర్ అంటూ ధ్వజమెత్తారు. చిన్న చిన్న విషయాలకు బండిని అరెస్ట్ చేసి కేసీఆరే హైప్ చేశారని విమర్శించారు. అదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయకుండా వదిలేయడం వెనుక ఆంతర్యం ఏమిటో బండి సంజయ్ చెప్పాలన్నారు.
బండి సంజయ్ కి బుద్ధి ఉందా ..? .ఓసారి హాస్పిటల్‌లో చూపించుకోవాలి. కాంగ్రెస్‌కు అభ్యర్థులను ప్రకటించేది కేసీఆర్ అని సంజయ్ ఎలా మాట్లాడతారు..?, కరీంనగర్‌లో గంగుల కమలాకర్ బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈటెలతో మాత్రం బండి మాట్లాడరు. కరీంనగర్ అభివృద్ధి విషయంలో జర్నలిస్టులు, బార్ అసోసియేషన్తో పాటు ఐదు సంఘాల పెద్ద మనుషులను జడ్జిలుగా ఉంచి చర్చిద్దాం. అందుకు ప్రస్తుత ఎంపీ సంజయ్, మాజీ ఎంపీ వినోద్ సిద్దమేనా..? ’ అంటూ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment