
బొమ్మకల్ పెట్రోల్‌బంకులో నీళ్లు వస్తున్న దృశ్యం
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీరు కలిపి పోశారంటూ వాహనదా రులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం 11 గంటలకు దుర్శేడ్‌కు చెం దిన బత్తిని శివ తన వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. కొంతదూరం వెళ్లినతర్వాత వాహనం ఆగిపోవడంతో స్థానికంగా ఉన్న మెకానిక్‌కు చూ పించాడు. కల్తీ పెట్రోల్ పోసినట్లు అతను చెప్ప డంతో బంకుకు తిరిగి వచ్చిన శివ, అక్కడి సిబ్బంది తో వాగ్వాదానికి దిగాడు.
అనుమానంతో బాటిల్‌లో పెట్రోల్ పోసి చూడగా సగానికిపైగా నీళ్లు ఉండటంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. వారు సిబ్బందిని ప్రశ్నించగా సాంకేతిక సమస్యతో నీళ్లు వచ్చాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పలువురు వాహనదారులు అక్కడికి వచ్చి కల్తీ పెట్రోల్ పోశారని ఆందోళనకు దిగారు. దీంతో బంకు సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీళ్లు నిల్వ ఉండి పెట్రోల్ ట్యాంకు లోపలికి రావడంతో నీళ్లు వస్తున్నాయంటూ నిర్వాహకులు చెప్పారు. చివరకు వాహనదారుల ఆందోళనతో నిర్వాహకులు పెట్రోల్ బంకును మూసివేశారు. కల్తీ పెట్రోల్‌పై బత్తిని శివ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.