![BRS Vinod kumar Sensational Comments On chandrababu over Hyderabad UT](/styles/webp/s3/article_images/2024/05/7/vinod.jpg.webp?itok=Qo2-QDd2)
సాక్షి, కరీంనగర్: చంద్రబాబు నాయుడిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంగనగర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయి. పార్లమెంట్‌లో గళం విప్పాలంటే నేను గెలువాలి. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment